/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/Final-list-of-voters-on-October-4.jpg)
Telangana Elections 2023: ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునేవారు లేదా ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలనుకునే వారు అక్టోబర్ 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం (Election Commission) హైకోర్టుకు తెలిపింది. 2019 సార్వత్రికఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ తో కూడిన ధర్మాసనానికి ఈసీ ఈ విషయాన్ని తెలియజేసింది. నాంపల్లి అసెంబ్లీ నియోజవకర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టేలా ఈసీ అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది జుల్పాకర్ ఆలం కోర్టుకు తెలిపారు.
ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఇప్పటికే రివిజన్ చేపట్టి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించారని...అయితే నవంబర్ 10వ తేదీ నామినేషన్ చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాను సవరించవచ్చని దేశాయ్ తెలిపారు. ఈసీ మార్పులు చేయాలంటే ఈ తేదీకి కనీసం పదిరోుల ముందు దరఖాస్తు చేయాలని తెలిపాడు. ఒకవేళ పిటిషనర్ గడువుకంటే ముందే సవరణ కోసం ఈసీని ఆశ్రయించినట్లయితే...ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దరఖాస్తును చట్టానికి అనుకూలంగా వ్యవహరిస్తారని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ కోర్టు జ్యోక్యంతో కేసు నిలిపివేయలేరని...బెంచ్ పిటిషన్ ను కొట్టివేస్తూ పేర్కొంది.
ఇది కూడా చదవండి: పాస్ పోర్టు కావాలా? ఈ పని చేస్తే వారంల్లోగా మీ చేతుల్లోకి…!!
కాగా గ్రేటర్ హైదరాబాద్ నుండి 20వేల మందికిపైగా మరణించిన వ్యక్తులు కూడా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అర్హులుగా జాబితాలో పేర్లుఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ఈ పేర్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల గురించి కుటుంబ సభ్యులు ఎన్నికల అధికారులకు తెలియజేసి పేర్లను తొలగించాలని కోరినప్పటికీ సమస్య అలాగే ఉంది అనేక రాజకీయ పార్టీలు, కార్యకర్తలు ఓటర్ల జాబితాలలోని వ్యత్యాసాలను ఎత్తిచూపారు.గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుండి 20,000 మందికి పైగా మరణించిన వ్యక్తులు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సీనియర్ అధికారులు తెలిపారు. ఈ ఆవిష్కరణ ఓటింగ్ కోసం ఈ పేర్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.రాగెల్లి, బానూరు కుటుంబాలు, చనిపోయిన వారి బంధువులు ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఉన్నారని నివేదించారు. తమ ఓట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు జాబితా నుంచి ఈ పేర్లను తొలగించాలని వారు అభ్యర్థించారు.
మీ ఓటర్ ఐడీని ఇలా సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోండి:
-ముందుగా మీరు http://voterportal.eci.gov.in/ లేదంటే https://www.nvsp.in/ వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి.
-మనుపు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ అవ్వండి. లేదంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
-లాగిన్ అయిన తర్వాత హోం పేజీలోకి వెళ్లి E-EPIC Download పై క్లిక్ చేయండి.
– E-EPIC నెంబర్ ఎంటర్ చేసి రాష్ట్రం పేరు ఎంచుకుని సెర్చ్ చేయాలి.
-తర్వాత ఓటీపీ పై క్లిక్ చేయాలి.
-ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
-ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై చేస్తుంది.
-తర్వాత క్యాప్చా కోడ్ ఎంట్ చేయాలి. E-EPIC పై క్లిక్ చేయండి.
-పీడీఎఫ్ ఫార్మాట్ లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు డౌన్ లోడ్ అవుతుంది.
Follow Us