/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/osro-jpg.webp)
యావత్ ప్రపంచమంతా చంద్రయాన్ -3 జాబిల్లిపై అడుగుపెట్టె క్షణంకోసం ఆసక్తిగా ఎదురుచేస్తోంది. ఈ సమయంలో ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన దేశ ప్రజలనమ్మకాన్ని మరింత పెంచేలా చేసింది. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇస్రో సోమనాథ్ పాల్గొన్నారు. ఆగస్టు 23న చంద్రయాన్న 3 సురక్షితంగా చంద్రుడిపై దిగేందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో 30 కిలో మీటర్ల ఎత్త నుంచి ల్యాండర్ వేగాన్ని తగ్గించడమే అత్యంత క్షష్టమైన ప్రక్రియగా చెప్పారు. చంద్రయాన్ 2 సమయంలో ఈ దశలో జరిగిన ప్రక్రియలోనే సమస్యలు తలెత్తాయని ఆయన తెలిపారు.
అయితే అలాంటి సమస్యలు రాకుండా చంద్రయాన్ 3ని డిజైన్ చేసినట్లు తెలిపారు. డిజైన్ వైఫల్యాలను తట్టికునేవిధంగా ల్యాండర్ విక్రమన్ ను తయారు చేసినట్లు చెప్పారు. ఎక్కువ ఇంధనం వాడకుండా చూడటమే కాకుండా దూరాన్ని ఖచ్చితంగా లెక్కించినట్లు చెప్పారు. ఆగస్టు 23న ల్యాండర్ లో అన్నీ ఫెయిల్ అయినా ల్యాండర్ సురక్షితంగా జాబిల్లి ఉపరితలంపైకి చేరుకుంటుందని సోమనాథ్ చెప్పారు.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 9, 2023
Even closer to the moon’s surface.
Chandrayaan-3's orbit is reduced to 174 km x 1437 km following a manuevre performed today.
The next operation is scheduled for August 14, 2023, between 11:30 and 12:30 Hrs. IST pic.twitter.com/Nx7IXApU44
కాగా చంద్రయాన్ -3 మిషన్ జూలై 14, 2023న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి మధ్యాహ్నం 2.35 PM ISTకి LVM-3 రాకెట్‌పైకి దూసుకెళ్లింది. టేకాఫ్ లాంచ్ మాడ్యూల్ నుండి విడిపోయిన తర్వాత, చంద్రయాన్-3 వ్యోమనౌక అనేక విన్యాసాలను అమలు చేసింది . ఎట్టకేలకు ఆగస్టు 5న "ట్రాన్స్‌లూనార్" కక్ష్యలోకి ప్రవేశించే ముందు ప్రతిసారీ ఒక ఎత్తైన భూమి కక్ష్యను తగ్గించింది. ఆగస్టు 14 ఉదయం 11. 30 నుంచి 12.30 మధ్య మరోసారి భూకక్ష్యను తగ్గిస్తామని తెలిపారు. మరో రెండుసార్లు కక్ష్యను తగ్గించిన అనంతరం స్పేస్ క్రాఫ్ట్ చందమామకు చేరువైతుంది. ఆగస్టు 16న చివరిసారి కక్ష్యను తగ్గించనున్నట్లు సోమనాథ్ తెలిపారు. ఆ సమయానికి చంద్రయాన్ 3 100కిలోమీటర్ల కక్ష్యలోకి చేరువైతుంది. ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తారు.