చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధానితో సహా పాల్గొననున్న 7 రాష్ట్రాల సీఎంలు!

రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉదయం 11:27 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు నాయుడు తన ఎక్స్ పేజీలో ప్రకటించారు.ప్రధాని తో సహా 7 రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నట్టు చంద్రబాబు తెలిపారు.

New Update
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధానితో సహా పాల్గొననున్న 7 రాష్ట్రాల సీఎంలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ సారి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ఘనవిజయం సాధించింది.

రేపు ఉదయం 11:27 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరంలో మంత్రివర్గ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు నాయుడు తన ఎక్స్ పేజీలో ప్రకటించారు. ఇందుకోసం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలోని మైదానంలో కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

Advertisment
తాజా కథనాలు