Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని.. గత ప్రభుత్వంలో చాలా దూకుడుగా ఉండేవారు. ఆయన రాజకీయ ప్రస్థానం ముందుగా టీడీపీలోనే మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే, కొన్ని విభేదాల కారణంగా టీడీపీ నుండి బయటకి వచ్చి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Also read: జగన్ పై కక్ష.. ఇలానే తీర్చుకుంటా.. రఘురామ సంచలన వ్యాఖ్యలు..!
2024 ఎన్నికల్లో కొడాలి నానితో పాటు వైసీపీ ఘోరంగా ఓటమి చెందడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఓటమి చెందినా.. కొడాలి నాని ఏ మాత్రం తగ్గకుండా టీడీపీ దాడులు చేస్తుదంటూ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు కూడా గుప్పించారు. అయితే, తాజాగా, చంద్రబాబు సర్కార్ కొడాలి నానికి బిగ్ షాక్ ఇచ్చింది. అతడి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది తోపాటు వ్యక్తిగత సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.