Lunar Eclipse: చంద్ర దోషం పట్టిందా? అయితే ఈ వస్తువులను దానం చేయండి..!

చంద్రగ్రహణం రోజు ఎవరికైనా తెల్లని వస్త్రాలను దానం చేయడం శుభప్రదం. అలాగే సంపద, వ్యాపారం కూడా పెరుగుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత పాలతో చేసిన స్వీట్లను దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చంద్ర దోష ప్రభావం తగ్గుతుంది.

New Update
Lunar Eclipse: చంద్ర దోషం పట్టిందా? అయితే ఈ వస్తువులను దానం చేయండి..!

Chandra Grahanam 2024: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి 25న సంభవించింది. అంటే ఇవాళే చంద్రగ్రహణం. మరో విశేషం ఏంటంటే.. ఇవాళే హోలీ కూడా. ఇక ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు. కాబట్టి ఇది హోలీ పండుగపై ఎలాంటి ప్రభావం చూపదు. అయినప్పటికీ దాని ప్రతికూల ప్రభావాలను నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే జ్యోతిషశాస్త్రంలో చంద్రగ్రహణం శుభప్రదంగా పరిగణించబడదు. చంద్రగ్రహణం సమయంలో అన్ని రకాల ప్రతికూల శక్తులు బయటకు వస్తాయని, ఇది ప్రతి ఒక్కరినీ ప్రతీకూలంగా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చంద్రగ్రహణం అశుభ ప్రభావాలను నివారించడానికి కొన్ని వస్తువులను దానం చేయండి. గ్రహణం వల్ల కలిగే దుష్ఫలితాలు తగ్గాలంటే ఉవి దానం చేయవచ్చో తెలుసుకోండి.

తెల్లని వస్తువులు దానం:
తెల్లని వస్తువులు చంద్రునికి సంబంధించినవి. చంద్రగ్రహణం రోజున తెల్లటి వస్తువులను దానం చేయండి. వీటిని దానం చేయడం వల్ల చంద్ర దోష ప్రభావం తగ్గుతుంది.పాల

దానం:
చంద్రగ్రహణం ముగిసిన తర్వాత పాలతో స్వీట్లను దానం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.లక్ష్మిదేవీ కూడా సంతోషిస్తుంది.

అన్నం దానం చేయండి:
చంద్రగ్రహణం తర్వాత పేదవారికి అన్నం దానం చేయండి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది. అలాగే సంపద, వ్యాపారం కూడా పెరుగుతాయి.

తెల్లని బట్టలు దానం:
చంద్రగ్రహణం తర్వాత తెల్లని వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం శుభప్రదం. ఇక చంద్రగ్రహణం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి.

ముత్యాలు, వెండి దానం:
వీలైతే, మీరు ఈ రోజున ముత్యాలు, వెండిని కూడా దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చంద్రగ్రహణం వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ముఖ్యగమనిక: ఈ వ్యాసం ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. పైన పేర్కొన్న విషయాలు నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవు. ఆర్టీవీ ఈ ఆర్టికల్‌కు బాధ్యత వహించదు.

Also Read: తేడావస్తే “రంగు పడుద్ది..” హోలీ పండగపూట ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే.!

Advertisment
తాజా కథనాలు