AP: ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. రెండు రాష్ట్రాల విభజన హామీలకై రెండు రాష్ట్రాల సీఎంలు కలుస్తున్నారన్నారు. హామీలపై స్పష్టమైన అవగాహన వస్తుందని ఆశిస్తున్నానన్నారు. విభజన హామీలపై పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుందని విమర్శలు గుప్పించారు. ఏ పార్టీ కూడా రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఆలోచనలో లేవని.. కృష్ణ జలాల విషయంలో ఆంధ్రకు తీరని ద్రోహం జరుగుతుందన్నారు.
Also Read: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే!
రెండు రాష్ట్రాల సమస్యలను కేంద్రం కూర్చోపెట్టి పరిష్కరించవచ్చన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేయలని కేంద్రం చూస్తుందని.. దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు ఉక్కు శాఖ మంత్రులుగా ఉన్నారన్నారు. భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ సహాయ మంత్రిగా వున్నారని.. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదేనని పేర్కొన్నారు.