ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...ఇక పోల’వరం’ కానుంది..! పోలవరం విషయంలో ఏపీ పంటపండింది.రాష్ట్ర ప్రభుత్వం మొర కేంద్ర ప్రభుత్వం చెవికి చేరింది. పదేపదే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.ప్రాజెక్ట్ లో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని ఇన్నాళ్లూ మొండికేసిన కేంద్ర ప్రభుత్వం..ఇప్పుడు శుభవార్త చెప్పింది.రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.ఇప్పుడు తాగునీటి విభాగం కోసం చేసే ఖర్చును కూడా తామే భరిస్తామని జలశక్తి మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు జవాబిచ్చారు. By V. Sai Krishna 31 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి పోలవరం విషయంలో ఏపీ పంటపండింది.రాష్ట్ర ప్రభుత్వం మొర కేంద్ర ప్రభుత్వం చెవికి చేరింది. పదేపదే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్ట్ లో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని ఇన్నాళ్లూ మొండికేసిన కేంద్ర ప్రభుత్వం..ఇప్పుడు శుభవార్త చెప్పింది.రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఇప్పుడు తాగునీటి విభాగం కోసం చేసే ఖర్చును కూడా తామే భరిస్తామని పేర్కొంది.ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి 55వేల 548 కోట్ల రూపాయల నిధుల గురించి విజయసాయి రెడ్డి ప్రశ్నించగా.. జలశక్తి మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు జవాబిచ్చారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి 10వేల 911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్ నిర్మాణం మరమ్మతుల కోసం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆర్థికశాఖ ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే, కాంపోనెంట్‌వారీగా నిధుల చెల్లింపు వల్ల ప్రాజెక్ట్ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని.. చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనల్లోనూ పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. కాంపోనెంట్ వారీ చెల్లింపులపై సీలింగ్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయవిభాగం గత జూన్ 5న తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు.. రాజ్యసభలో మంత్రి బిశ్వేశ్వర్ వెల్లడించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీకి మేలు జరగనుంది. దీని కారణంగా కేంద్రం నుంచి మరిన్ని నిధులు రానున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలనే నిధులు విడుదల చేసిన కేంద్రం.. తాజాగా.. ఈ నిర్ణయం తీసుకోవడం ఏపీకి కలిసివచ్చే అంశంగా పేర్కొంటున్నారు. #polavaram-progress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి