Janasena: జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నిక సంఘం ఆదేశాలు జారీ చేసింది. పేరా 10B ప్రకారం అన్ని అసెంబ్లీ స్థానాలకు గ్లాస్ గుర్తును కేటాయించినట్లు ఈసీఐ పేర్కొంది. పేరా 10B ప్రకారం జనసేన అభ్యర్థి పోటీలో లేనట్లయితే ఫ్రీ సింబల్ అవుతుందని ఈసీ స్పష్టం చేసింది. అలాంటి స్థానాల్లో ఇండిపెండెంట్ లు కోరుకుంటే వారికి కేటాయించే అవకాశం ఉందని తెలిపింది.
Also Read: టీడీపీలో అసమ్మతి సెగ.. కారుపై సొంత పార్టీ నేతలే రాళ్ల దాడి..!
రాష్ట్రంలో 10 శాతానికి పైగా స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుండడంతో గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించవద్దంటూ జనసేన. ఈసీఐని కోరినట్లు తెలుస్తోంది. జనసేన విన్నపంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనట్లు అర్థమవుతోంది. అయితే, సింబల్ లో ఏ ఇబ్బంది రాకుండా ఉండేలా జనసేన ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: రోడ్డు ప్రమాదం.. సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి..!
ఇదిలా ఉండగా.. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆర్వోలు ప్రకటించనున్నారు. అభ్యర్థుల జాబితాతో పాటు గుర్తులూ కేటాయించనున్నారు ఎన్నికల అధికారులు. జనసేన పోటీ చేయని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఒకరికంటే ఎక్కువ మంది గాజు గ్లాస్ గుర్తు కోరుకుంటే అధికారులు లాటరీ తీయనున్నారని తెలుస్తోంది. అయితే, గాజు గ్లాస్ గుర్తు వేరే అభ్యర్థులకు కేటాయించొద్దని ఇప్పటికే ఈసీని కోరిన కూటమి పార్టీలు.