Ear Pain: కొంత మంది తరచుగా చెవి పోటు సమస్యతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి భరించలేనంత తీవ్రంగా మారుతుంది. అసలు చెవి పోటు సమస్య రావడానికి కారణమేంటి..? చెవి పోటు సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఏంటి..? అలాగే ఈ సమస్య తగ్గించడానికి తీసుకోవాల్సిన ట్రీట్ మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం
చెవి పోటుకు కారణాలు
బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్
బ్యాక్టీరియ, వైరస్ వంటి వ్యాధికార క్రిములు చెవి లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్స్ కు దారి తీస్తాయి. ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా బ్యాక్టీరియాలు చెవి పోటుకు ఎక్కువగా కారణం.
సైనస్ ఇన్ఫెక్షన్
సైనస్ క్యావిటీస్ లో కలిగే ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి చెవి వరకు వ్యాపిస్తుంది. ఇది చెవిలో మంట, ఇన్ఫెక్షన్ ను కలిగిస్తుంది. అందుకే సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు కూడా చెవి పోటుకు ఎక్కువగా గురవుతుంటారు.
అలర్జీస్
అలర్జిక్ రియాక్షన్స్ చెవిలో మంట, ఫ్లూయిడ్ పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది చెవిలో ఇన్ఫెక్షన్ ను మరింత పెంచే అవకాశం ఉంటుంది.
చెవిలో తేమ
నీళ్లలో ఎక్కువ సేపు ఉండడం కూడా చెవి పోటు సమస్యకు కారణం. ఎక్కువ సేపు తేమకు గురికావడం.. చెవి లోపల బ్యాక్టీరియా పెరుగుదలకు వీలుగా ఉంటుంది.
Also Read: Green Tea : భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే.. ఏమవుతుందో తెలుసా
లక్షణాలు
- చెవి నొప్పి
- చెవి నుంచి పసుపు లేదా బ్లడ్ తో కూడిన చీము రావడం
- జ్వరం
- చెవి సరిగ్గా వినిపించకపోవడం
ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్
యాంటీ బయోటిక్స్
బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ పై యాంటీ బయోటిక్స్ ప్రభావంగా పనిచేస్తాయి. వైద్య నిపుణులను సంప్రదించి మెడికేషన్ తీసుకోవాలి.
పెయిన్ రిలీఫ్
చెవి పోటు తీవ్రంగా ఉన్నప్పుడు ఎసిటమైనోఫెన్ , ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ రిలీవర్స్ తీసుకుంటే నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది.
ఇయర్ డ్రాప్స్
యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫలమేటరీ కాంబినేషన్ కలిగిన ఇయర్ డ్రాప్స్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇయర్ వ్యాక్స్ తొలగించడం
చెవిలో ఇయర్ వ్యాక్స్ ఎక్కువైనప్పుడు ఇన్ఫెక్షన్స్ కు దారి తీస్తాయి. వైద్య నిపుణుల సహాయంతో చెవిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. దీని వల్ల చెవి పోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే