Cash Transactions: యూపీఐ ఉన్నా.. క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గలేదు 

ఒకపక్క క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంటే.. మరో పక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవడం 10.37 శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆ లెక్కలు పూర్తిగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

Cash Transactions: యూపీఐ ఉన్నా.. క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గలేదు 
New Update

Cash Transactions: ప్రస్తుతం  చాలా విషయాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుల  లావాదేవీలు డిజిటల్‌గా మాత్రమే చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. చాలా లావాదేవీలు UPI ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఫోన్ తోనే ట్రాన్సాక్షన్స్ చేసేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ క్యాష్ ట్రాన్సాక్షన్స్(Cash Transactions) పై మోజు ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం లెక్కలు అదే చెబుతున్నాయి. ఎందుకంటే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా దాదాపు రూ. 1.43 కోట్లు ATM నుండి విత్‌డ్రా చేశారు ప్రజలు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 5.51 శాతం ఎక్కువ. ఏటీఎం మెషీన్లలో నగదును నిర్వహించే సంస్థ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ సోమవారం సమర్పించిన నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ ఏటా ఏటీఎంల నుంచి సగటున నెలవారీ నగదు విత్ డ్రా పెరిగిందని కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ.1.35 కోట్లు. నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో మెట్రోలలో సగటు నగదు ఉపసంహరణ(Cash Transactions) 10.37 శాతం పెరిగింది, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 3.94 శాతం. అలాగే నగరాల్లో 3.73 శాతం పెరిగింది.

Also Read: మీకు తెలుసా? హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు నగరాలను బట్టి నిర్ణయిస్తారు 

మెట్రో నగరాల్లో పెరిగిన క్యాష్ విత్ డ్రాలు.

నివేదిక ప్రకారం, మెట్రో నగరాల్లోని ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా(Cash Transactions) 37.49 శాతం పెరగగా, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా 12.50 శాతం పెరిగింది. మెట్రోపాలిటన్ మరియు పట్టణ ప్రాంతాలలో, ప్రభుత్వ బ్యాంకులు 49 శాతం ATMలను కలిగి ఉండగా, ప్రైవేట్ రంగ బ్యాంకులు 64 శాతం ATMలను కలిగి ఉన్నాయి. రెండు వర్గాల మిగిలిన ATMలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

ఈ రాష్ట్రంలో గరిష్టంగా నగదు ఉపసంహరణ 

నివేదిక ప్రకారం, నగదు ఉపసంహరణ(Cash Transactions)లో దేశంలో కర్ణాటక ముందంజలో ఉంది, ఇక్కడ ఏటీఎం నుండి సగటున రూ.1.83 కోట్లు విత్‌డ్రా చేయబడ్డాయి. దీని తర్వాత రూ.1.82 కోట్లతో ఢిల్లీ రెండో స్థానంలో, రూ.1.62 కోట్లతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉన్నాయి.

#cash #atm
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe