TS News : తెలంగాణలో 9 లక్షల ఓట్ల తొలగింపు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా.! By Bhoomi 27 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS News : తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల 14 వేల 354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు ఓట్ల తొలగింపు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తయినట్లు వెల్లడించారు. మొత్తం 7 లక్షల 31 వేల 573 మంది వివరాలు సవరించినట్లు వికాస్ రాజ్ చెప్పారు. కొత్తగా ఓటరు నమోదుతోపాటు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్చుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందని ఆయన తెలిపారు. కాగా రాష్ట్రంలో తాజా సవరణ తర్వాత ఓటర్ల సంఖ్య 3 కోట్ల 30 లక్షల 13 వేల 318కి చేరింది. ఓటర్లలో పురుషులు కోటీ 64 లక్షల 14 వేల 693 మంది ఉండగా...మహిళలు కోటీ 65 లక్షల 95 వేల 896 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ట్రాన్స్ జెండర్లు 2 వేల 729 మంది ఉండగా.. 15 వేల 472 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. 18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 8 లక్షల 72 వేల 116 మంది ఉంటే... 85 ఏళ్ల దాటిన వారు లక్ష 93 వేల 489 మంది, దివ్యాంగులు 5 లక్షల 26 వేల 286, ఎన్ఆర్ఐ ఓటర్లు 3 వేల 409 మంది ఉన్నారు.ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా.. 38 కోట్ల 12 లక్షల రూపాయల విలువైన నగదు, నగలు, మద్యం, డ్రగ్స్, వస్తువులు స్వాధీనం చేసుకున్నాం రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. ఓటర్ లిస్ట్ లో మీ పేరును చెక్ చేసుకోవడానికి ఈ సింపుల్ స్టెప్స్: 1. ముందుగా ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://ceotelangana.nic.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి. 2. అనంతరం హోం పేజీలో కనిపించే Search Your Name విభాగంలో Search Your Name—> VOTERS SERVICE PORTAL ఆప్షన్ ను ఎంచుకోండి. 3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జిల్లా, నియోజకవర్గం నమోదు చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి. దీంతో ఈ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. 4. మీ వద్ద ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే.. EPIC Number ను నమోదు చేయడం ద్వారా కూడా మీ ఓటు వివరాలను చెక్ చేసుకోవచ్చు. 5. మీ ఫోన్ నంబర్, ఓటీపీ ద్వారా కూడా మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో? లేదో? అన్నది తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి: ఏందిరా ఇది..కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత..వైరల్ ఫొటో.! #9-lakh-voters-deleted-from-list-in-telangana #telangana-voter-list-2024 #telangana-ec-deletes-9-lakh-voters-from-the-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి