Call Forwarding: కాల్‌ ఫార్వార్డింగ్‌ సర్వీసు రద్దు.. ఎందుకంటే!

పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఏప్రిల్ 15 నుంచి తదుపరి ఆదేశాల వరకు కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యం ఉండదు.

New Update
Call Forwarding: కాల్‌ ఫార్వార్డింగ్‌ సర్వీసు రద్దు.. ఎందుకంటే!

Call Forwarding Service Closed: కాల్‌ ఫార్వార్డింగ్‌ గురించి తెలుసు కదా.. ఒకవేళ మన ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ లేదా మన దగ్గర అందుబాటులో లేకపోతే చాలామంది కాల్‌ ఫార్వార్డింగ్‌ ఆప్షన్‌ను పెట్టుకునేవారు. ఏ నంబర్‌కైతే కాల్‌ ఫార్వార్డ్‌ చేస్తామో ఆ నంబర్‌కు మన కాల్‌ వెళ్తుంది. అయితే ఇకపై ఇలాంటివి కుదరకపోవచ్చు. స్మార్ట్ ఫోన్లకు సంబంధించి టెలికాం శాఖ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి USSD ఆధారిత కాల్ ఫార్వార్డ్‌ డీయాక్టివేట్ కానుంది. మళ్లీ తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఈ సేవలను పునఃప్రారంభించవచ్చని అధికారిక ఉత్తర్వులు కూడా తెలిపాయి. మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే మోసాలు, ఆన్‌లైన్ నేరాలను అరికట్టేందుకు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

కొందరు దుర్వినియోగం చేస్తున్నారు:
మొబైల్ కస్టమర్‌లు తమ ఫోన్ స్క్రీన్‌పై ఏదైనా యాక్టివ్ కోడ్‌ని డయల్ చేయడం ద్వారా USSD సేవను యాక్సెస్ చేస్తారు. IMEI నంబర్, మొబైల్ ఫోన్ బ్యాలెన్స్‌తో సహా సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ సేవ తరచుగా ఉపయోగిస్తారు. SSSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టెలికాం శాఖ తెలిపింది.

నేరాలకు చెక్‌ పెట్టేందుకు:
ప్రభుత్వ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా సిమ్ కార్డుల జారీకి సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలంటే ఈ-వెరిఫికేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫిజికల్ వెరిఫికేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది శాఖ. ఇప్పుడు ఈ క్రమంలోనే USSD ఆధారిత కాల్ ఫార్వార్డ్‌ను నిలిపివేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు.

Also Read: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

Advertisment
Advertisment
తాజా కథనాలు