లాభాలతో ముగిసిన షేర్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 97, నిఫ్టీ 27 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ 97.84 పాయింట్లతో 82,988.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.25 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,383.75 వద్ద ముగిసింది.

author-image
By Manogna alamuru
Mid Cap Shares : ఈ మిడ్ క్యాప్ షేర్లు లాభాల పంట పండిస్తాయంటున్నారు.. అవేమిటంటే.. 
New Update

Trading Today: ఈరోజు ట్రేడ్ మార్కెట్ మంచి జోరుతో సాగింది. వారంలో మొదటి రోజైన ఈరోజు ట్రేడర్లు ఆరంభం నుంచే ఉత్సాహంగా ట్రేడింగ్ చేయడం కనిపించింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ముగిశాయి. అదీకాక సెన్సెక్స్ రికార్డ్ ముగింపు ఉందని మార్కెట్ పండితులు చెబుతున్నారు. మిడ్‌క్యాప్ ఇండెక్స్ వరుసగా మూడో రోజు లాభాల్లో ఎండ్ అయింది. ఎనర్జీ, మెటల్, రియల్టీ సూచీలు లాభాల్లో ముగియగా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఐటీ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 97.84 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 82,988.78 వద్ద ఉంది.

ఇక నిఫ్టీ ఎలా ఉందంటే..నిఫ్టీలో ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్, ఎల్ అండ్ టీ టాప్ గెయినర్లుగా ఉండగా.. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యుఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు బ్రిటానియా ఇండస్ట్రీస్ లస్‌లోకి వెళ్ళాయి.

ఎఫ్‌ఎమ్‌సీజీ, టెలికాం మినహా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో అంటే లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియల్టీ, మీడియా, మెటల్ సూచీలు 0.4-1 శాతం లాభంతో ఎండ్ అయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. కాగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం లాభపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి.. నిఫ్టీ 27.25 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,383.75 వద్ద ముగిసింది.

Also Read:  Hyderabad: వినాయక నిమజ్జనంపై సీఎం రేవంత్ సమీక్ష

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe