Adulterated Petrol: బంక్‌లో పెట్రొల్ కొట్టిస్తున్నారా..? అయితే ఒక్క క్షణం..! ఇది తెలుసుకోండి.

పెట్రోల్ బంక్‌లో కల్తీ ఉందో లేదో మీటర్‌లో కనిపించే డెన్సిటీ ద్వారా గుర్తించవచ్చు. పెట్రోల్ డెన్సిటీ 0.730-0.780, డీజిల్ 0.820-0.860 మధ్యలో లేకపోతే కల్తీ ఉన్నట్టు. కల్తీ ఇంధనం వాడితే ఇంజన్‌కు నష్టం. కనుక డెన్సిటీ చెక్ చేసి పెట్రోల్ కొట్టించుకోవడం ఉత్తమం.

New Update
Adulterated Petrol

Adulterated Petrol

Adulterated Petrol: పెట్రోల్ బంక్‌కి వెళ్లడం వాహనం ఉన్న ప్రతి వారికి తప్పనిసరి. కానీ అక్కడ పెట్రోల్ నిజమైనదా? లేక కల్తీ చేసిందా? అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే పెట్రోల్‌కి కల్తీ చేస్తున్నారా? అన్న విషయం బయటపడేది చాలా అరుదు. అధికారులు సడెన్ తనిఖీ చేస్తేనే ఆ బంక్‌లో కల్తీ ఉందని తెలుస్తుంది. అయితే మీరే కొన్ని చిన్న విషయాలు గమనిస్తే బంకులో కల్తీ జరుగుతోందా లేదా తెలిసిపోతుంది.

సాధారణంగా పెట్రోల్ పోసుకునేటప్పుడు మనం మీటర్‌లో ధర ఎంత? లీటర్లు ఎంత? అన్న రెండు బాక్సులు మాత్రమే చూస్తాం. కానీ మీటర్‌లో మూడో బాక్స్ కూడా ఉంటుంది. అది డెన్సిటీ (Density). ఈ డెన్సిటీ ద్వారా పెట్రోల్ నాణ్యత గురించి స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చు. చాలా మంది ఈ డెన్సిటీని పట్టించుకోరు కానీ ఇది చాలా ముఖ్యమైన సూచీ.

పెట్రోల్‌లో డెన్సిటీ ఎంత ఉండాలి?

పెట్రోల్‌లో కల్తీ లేకపోతే డెన్సిటీ 0.730 నుంచి 0.780 మధ్యలో ఉంటుంది.
 0.730 కంటే తక్కువ
 0.780 కంటే ఎక్కువ
అంటే ఆ పెట్రోల్‌లో ఏదో కలిపినట్లు అర్థం.

డీజిల్‌కి సరైన డెన్సిటీ ఎంత?

డీజిల్ డెన్సిటీ 0.820 నుంచి 0.860 మధ్యలో ఉండాలి. ఈ రేంజ్ దాటి ఉంటే డీజిల్‌లో కూడా కల్తీ ఉందని అర్థం.

ఏం కలుపుతారు?

పెట్రోల్‌కు కొంతమంది పామ్ ఆయిల్, ఇథనాల్ వంటి చవక పదార్థాలు కలుపుతారు. ఇవి ఎక్కువ శాతం కలిసితే పెట్రోల్ నాణ్యత పడిపోతుంది.

కల్తీ పెట్రోల్ వాడితే ఏమవుతుంది?

కల్తీ పెట్రోల్ వాడటం వలన ఇంజన్ పవర్ తగ్గిపోతుందిఎం, వాహనం పికప్ తగ్గుతుంది, లాంగ్ డ్రైవ్‌లో వాహనం ఒక్కసారిగా ఆగిపోవచ్చు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతాయి. అందుకే పెట్రోల్ వేసే ప్రతి సారి డెన్సిటీని ఒకసారి చూసుకోవడం మంచిది.

కల్తీ పెట్రోల్ కనిపిస్తే ఏమి చేయాలి?

  • ఒక బంక్‌లో డెన్సిటీ తప్పుగా ఉంటే
  • వెంటనే ఆ బంక్‌కి వెళ్లడం మానేయాలి
  • అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు
  • మీ వాహనాన్ని మెకానిక్‌తో చెక్ చేయించవచ్చు

చిన్న నిర్లక్ష్యం  వాహనంకు పెద్ద నష్టం చేస్తుంది. అందువల్ల డెన్సిటీని చెక్ చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో పెద్ద కష్టాలు తప్పించుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు