/rtv/media/media_files/2025/11/22/croma-black-friday-sale-2025-11-22-08-39-38.jpg)
Croma Black Friday Sale
Croma Black Friday Sale: క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో iPhone Air ధర భారీగా తగ్గింది. సాధారణంగా చాలా ఖరీదైన ఈ అల్ట్రా-స్లిమ్ ఫ్లాగ్‌షిప్‌ను ఇప్పుడు కేవలం ₹54,900 కు కొనుగోలు చేయవచ్చు. ఇది మొత్తం ₹65,000 వరకు తగ్గింపు అని చెప్పొచ్చు. ఈ ఆఫర్‌లో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ డీల్ నవంబర్ 22 నుండి 30 వరకు క్రోమా స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. కాని, కొనాలి అనుకుంటే ముందుగా ఈ ఫోన్ పాజిటివ్స్, అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి.
పాజిటివ్స్..
1. ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సన్నని iPhone ఇదే
iPhone Air కేవలం 5.6mm మందం మాత్రమే ఉండటం దీని పెద్ద ఆకర్షణ. ఇప్పుడు మార్కెట్లో వచ్చే చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్లు బరువుగా, పెద్దగా ఉండగా, ఈ ఫోన్ మాత్రం చాలా సన్నగా, స్టైలిష్‌గా ఉంటుంది.
156 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో చేతిలో పట్టుకోవడం చాలా తేలిక. టైటానియం ఫ్రేమ్, గ్లోసీ ఫినిష్ దీన్ని మరింత ప్రీమియంగా చూపిస్తోంది.
2. ప్రో లెవల్ పెర్ఫార్మన్స్
ఈ ఫోన్‌లో కూడా iPhone 17 Pro మోడళ్లలో ఉన్న A19 Pro చిప్‌సెట్ ఉంటుంది. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, గేమింగ్ అన్ని చాలా స్మూత్ గా ఉంటుంది. అయితే సన్నని బాడీ కారణంగా ఇతర ప్రో మోడళ్ల కంటే కొద్దిగా వేడెక్కుతుంది.
3. అందమైన డిస్‌ప్లే
iPhone Airలో 6.5 అంగుళాల OLED ProMotion స్క్రీన్ ఉంటుంది. కలర్స్, బ్రైట్‌నెస్ చాలా బాగుంటాయి. ఓటిటి, వీడియోలు చూసేటప్పుడు ఈ స్క్రీన్ చాలా మంచి అనుభవం ఇస్తుంది.
4. ఒకే కెమెరాతో 2x జూమ్ - మొదటిసారి iPhoneలో
ఈ ఫోన్‌లో ఒకే రియర్ కెమెరా ఉన్నప్పటికీ, ఇది 2x డిజిటల్ టెలిఫోటో జూమ్ అందిస్తుంది. ఫోటోలు మంచి క్వాలిటీలో వస్తాయి.
రోజువారీ ఫోటోగ్రఫీకి ఇది చాలా బెస్ట్.
నెగిటివ్స్..
1. ఒకే రియర్ కెమెరా
ఈ ఫోన్‌లో అల్ట్రావైడ్ లెన్స్ లేదు. ఫోటోగ్రఫీకి ఎక్కువ ఆప్షన్లు కావాలనుకుంటే- ఉదాహరణకు ట్రిప్స్, ల్యాండ్‌స్కేప్ షాట్లు- అయితే ఇది సరిపోకపోవచ్చు. iPhone 17, 17 Pro మోడళ్లు కెమెరా విషయంలో చాలా మెరుగ్గా ఉంటాయి.
2. తక్కువ బ్యాటరీ బ్యాకప్
ఫోన్ సన్నగా ఉండటం వల్ల బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గింది. సాధారణ వినియోగానికి రోజు మొత్తం నడుస్తుంది, కానీ
పవర్ యూజర్లకు ఇది సరిపోకపోవచ్చు.
అయితే, iPhone Air కోసం ప్రత్యేకంగా తయారు చేసిన MagSafe బ్యాటరీ ప్యాక్ కొనుగోలు చేయవచ్చు. స్టైలిష్, తేలికైన, ప్రీమియం iPhone కావాలనుకునే వారికి ఈ డీల్ చాలా బెస్ట్ అనే చెప్పాలి. కెమెరా ఆప్షన్లు ఎక్కువగా కావాలనుకునే వారు లేదా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే ఇతర మోడళ్లను కూడా చూడండి.
Follow Us