Small Business Idea: నెలకు మూడు లక్షలు సంపాదించే కిరాక్ ఐడియా.. కేజీ పండిస్తే చాలు..!!

మనదేశంలో చాలా మంది ప్రజలు సరికొత్త ప్రయోగాలతో వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వ్యవసాయంలో ఏదైనా భిన్నంగా చేసి...పెద్ద మొత్తం డబ్బు సంపాదించాలనుకుంటే...ఈ ఎపిసోడ్ లో మీకో చక్కటి వ్యాపారం గురించి పరిచయం చేస్తాము. దీని ద్వారా నెలకు మూడు నుంచి ఆరు లక్షల వరకు సంపాదించవచ్చు.

New Update
Small Business Idea: నెలకు మూడు లక్షలు సంపాదించే కిరాక్ ఐడియా.. కేజీ పండిస్తే చాలు..!!

నేటికాలంలో చాలామంది ఉద్యోగాలు వదులుకుని వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. లక్షలు సంపాదించే ఉద్యోగాలకంటే..సొంత పొలంలో వ్యవసాయం చేయడం మేలనుకునేవాళ్లు ఎంతో మంది. ఎందుకంటే పద్దతిగా కొత్త ప్రయోగాలతో వ్యవసాయం చేస్తే లక్షల్లో సంపాదించవచ్చు. భారతదేశం అంటేనే వ్యవసాయ ప్రధాన దేశం..కాబట్టి ప్రభుత్వం కూడా వ్యవసాయానికి సంబంధించి ఎన్నో ప్రోత్సహాకాలను కూడా అందిస్తుంది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైనది కుంకుమపువ్వు. కశ్మీర్, ఇరాన్, పర్షియన్ అనే కుంకుమ పేర్లు వినే ఉంటారు. క్వాలిటీ విషయానికొస్తే మొదటిస్థానంలో కశ్మీర్ కుంకుమపువ్వు ఉంటుంది. కిలో కుంకుమ పువ్వు సుమారు రూ. 3లక్షల వరకు ఉంటుంది. ఇది బంగారం ధరతో సమానంగా ఉంటుంది. కుంకుమ పువ్వు పండించేందుకు కశ్మీర్ నేలలు అనుకూలంగా ఉంటాయి. పొడినెలలో ఎక్కువగా పండుతుంది. దీనికోసం ఇసుక నేలల అనువైనవి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులను కలిపిస్తే పెద్ద మొత్తంలో కుంకుమ పువ్వును పండించే వీలుంటుంది. కుంకుమపువ్వును పండించేందుకు ఎకరాలకొద్దీ భూమి అవసరం లేదు. కొద్దిగా ఉన్నా చాలు...లక్షలు సంపాదించవచ్చు. మనదేశంలో దీని ధర 2.5లక్షల నుంచి 3లక్షల వరకు ఉంటుంది. ఇది ఉల్లిపాయ పంట తరహాలోనే ఉంటుంది. దీని విత్తనాలను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

పండించే విధానం:
ఈ విత్తనాలను విత్తే ముందు పొలాన్ని బాగా దున్నాలి. 20 టన్నుల ఎరువుతోపాటు 20 కిలోల నత్రజని, 60కిలోల భాస్వరం, పొటాషియం విత్తనాలు విత్తే ముందు పొలానికి చల్లాలి. వీటి కారణంగా కుంకుమపువ్వు ఉత్పత్తి గణనీయంగా ఉంటుంది. జూలై నుంచి ఆగస్టు వరకు కొండ ప్రాంతాల్లో దీనికి సాగుకు ఉత్తమ సమయం. మైదానా ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి మధ్య విత్తుతారు. గత కొన్నేండ్లుగా హర్యానా, రాజస్థాన్, యూపీలలో కూడా కుంకుమ సాగు జరుగుతోంది. దీని సాగుకు సూర్యకాంతి అవసరం. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలు కుంకుమ పువ్వు సాగుకు అనుకూలం. వర్షాకాలంలో కాకుండా వాతావరణం వెచ్చగా ఉన్నచోట దీనిని సాగు చేయవచ్చు. ఇసుక నేలలు, లోమీ నేలలు కుంకుమపువ్వుకు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇతర రకాల నేలల్లో కూడా సాగు చేయవచ్చు. పొలంలో నీటి ఎద్దడి ఉండకూదు. అందకోసం నీరు చేరని నేల అయితే బాగుంటుంది.

ఆదాయం:
ఈ పంటను సాగు చేస్తే చక్కటి ఆదాయం పొందవచ్చు. మంచి ధరకు మార్కెట్లో విక్రయించవచ్చు. అంతేకాదు ఆన్ లైన్లో కూడా అమ్మవచ్చు. నెలకు రెండు కిలోల కుంకుమ పవ్వును అమ్మితే...ప్రతినెలా 6 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు పూజాసామాగ్రి, స్వీట్లు, సౌందర్య సాధనాలు, పరిమళ ద్రవ్యాలు వంటి వాటిలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా గర్బిణీలు కుంకుమపువ్వు పాలు తాగితే పుట్టబోయే బిడ్డమంచి రంగుతో పుడతారని చాలా మంది నమ్ముతుంటారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు