Business Idea: ఇది ఫ్యూచర్ బిజినెస్.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే రాబడి! 

ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపే అందరూ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఆ బిజినెస్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి.. తెలుసుకోండి.. 

New Update
Business Idea: ఇది ఫ్యూచర్ బిజినెస్.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే రాబడి! 

Business Idea: పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. నిత్యం ఆఫీసులకు వెళ్లే వారికి.. పెట్రోల్ ధరల భారం రోజురోజుకూ మోయలేనిదిగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అటువంటి వారికి మంచి స్నేహితుల్లా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి రావడం ప్రారంభమైన సమయంలో కొనాలంటే ఎన్నో సందేహాలతో వెనకడుగు వేసిన వారు.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. కొత్తగా వాహనాలు కొనాలని అనుకునేవారు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. మోటారు వాహనాల కంపెనీల లెక్కలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ గురించి చెబుతున్నాయి. వ్యాపారం అన్నారు.. ఫ్యూచర్ బిజినెస్ అన్నారు.. ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పబోయే వ్యాపారానికి ఎలక్ట్రిక్ వాహనాలకు లింక్ ఉంది కాబట్టే ఈ ఉపోద్ఘాతం.  

Business Idea: నిజానికి ఇప్పుడు  ఎక్కడ చూసినా పోటీ నెలకొంది. అయితే ప్రస్తుతం పెద్దగా పోటీ లేని రంగం ఒకటి ఉంది. అది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ఈ వ్యాపారం. ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతోపాటు సీఎన్‌జీ ధర కూడా పెరిగింది. అటువంటి పరిస్థితిలో, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా భారీ లాభాలను సంపాదించవచ్చు. అది ఎలాగో చెప్పుకుందాం...

ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్స్..
Business Idea: 20వ అంతర్జాతీయ ఫ్రాంచైజ్ .. రిటైల్ షోలో, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్‌లను తయారు చేసే కంపెనీ పెట్టుబడిదారులకు వారితో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించింది. 18-19 మే 2024న, ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షనల్ సెంటర్‌లో జరిగిన రిటైల్ ఫ్రాంచైజ్ షోలో దేశంలోని 100 కంటే ఎక్కువ నగరాలు .. ఆసియా-పసిఫిక్ నుండి 500 కంటే ఎక్కువ మంది ఫ్రాంఛైజర్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు .. వేలాది మంది కొనుగోలుదారులు ఇందులో పాల్గొన్నారు.

ఇలాంటి అవకాశం..
Business Idea: ఎర్త్‌ట్రాన్ EV  ఒక  అంతర్జాతీయ ఫ్రాంచైజ్ .. రిటైల్ షోలో ఛార్జర్‌లను ప్రదర్శించింది. ఎర్త్‌ట్రాన్ EV వ్యవస్థాపకుడు ఆశిష్ దేస్వాల్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న పెట్రోల్ .. డీజిల్ ధరల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీని కారణంగా వారు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్తమ ఎంపికగా పరిగణిస్తున్నారని చెప్పారు. భారతీయ కస్టమర్లు ఇప్పుడు EV వాహనాలను విశ్వసించడం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం, మనకు దేశంలో ఛార్జింగ్ స్టేషన్ మౌలిక సదుపాయాలు అవసరం. ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు కంపెనీల షో రూమ్స్ వద్ద.. సర్వీస్ సెంటర్స్ దగ్గర మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్థ వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేలా ఆసక్తి ఉన్నవారికి ఫ్రాంచైజ్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎవరైనా ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసే వ్యాపారం చేయాలనీ అనుకుంటే ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. దీనికి ఏమి అవసరం అవుతుంది.. ఏంత పెట్టుబడి కావాలి? ఆదాయం ఎంత ఉండాలి? ఈ విషయాలను తెలుసుకుందాం. 

Also Read:  ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బే.. డబ్బు.. ఎందుకు.. ఎలా వచ్చింది?

ఎంత స్థలం అవసరం అవుతుంది?
Business Idea: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించడానికి, మీరు తప్పనిసరిగా రోడ్డు పక్కన 50 నుండి 100 చదరపు గజాల ఖాళీ ప్లాట్‌ని కలిగి ఉండాలి. ఈ ఖాళీ స్థలం మీ పేరు మీద ఉండవచ్చు లేదా 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవచ్చు. 

ఎలా ప్రారంభించాలి?
Business Idea: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను సెటప్ చేయడానికి, మీరు కంపెనీతో భాగస్వామిగా ఉండాలి. మీరు మీ లొకేషన్‌ను కంపెనీకి చూపించాలి, ఆపై కంపెనీ మీ ఛార్జింగ్ స్టేషన్‌ను 10-15 రోజుల్లో పూర్తి సెటప్ చేస్తుంది. ఛార్జింగ్ స్టేషన్‌లో కార్ల పార్కింగ్ .. వాటి ప్రవేశం .. నిష్క్రమణ కోసం సరైన ఏర్పాట్లు ఉండాలని మీరు గుర్తుంచుకోవాలి. దీనితో పాటు, ఛార్జింగ్ స్టేషన్‌లో స్వచ్ఛమైన తాగునీరు, టాయిలెట్, విశ్రాంతి గది, అగ్నిమాపక పరికరం .. వెంటిలేషన్ సౌకర్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉండాలి.

ఎంత ఖర్చు అవుతుంది?
Business Idea: EV ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుండి.  అయితే, మీరు దీని కంటే తక్కువ ఖర్చుతో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు తక్కువ కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేస్తే, దాని ధర రూ. 8 లక్షల వరకు ఉండవచ్చు. భూమి నుండి ఛార్జింగ్ పాయింట్ సంస్థాపన వరకు ఖర్చులు ఇందులో ఉన్నాయి.

మీరు ఎంత సంపాదిస్తారు?
మీరు 3000 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేస్తే, మీరు కిలోవాట్‌కు రూ. 2.5 సంపాదిస్తారు. దీని ప్రకారం, మీరు ఒక రోజులో రూ.7500 వరకు సులభంగా సంపాదించవచ్చు. అంటే నెలలో రూ.2.25 లక్షల వరకు సంపాదించవచ్చు. అన్ని ఖర్చులను తీసుకున్న తర్వాత, మీరు ఈ వ్యాపారం నుండి నెలకు రూ. 1.5 లక్షల నుండి రూ. 1.75 లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు. అయితే, ఛార్జింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచినట్లయితే, ఈ సంపాదన నెలకు రూ.10 లక్షల వరకు చేరుతుంది.

వ్యాపారంలో పోటీ ఎంత?
EV ఛార్జింగ్ స్టేషన్ అనేది కొత్త కాన్సెప్ట్, ప్రస్తుతం ఈ బిజినెస్ ఐడియాలో పెద్దగా పోటీ లేదు, ఎలాంటి పోటీ లేకుండా సంపాదిస్తున్న బిజినెస్ ఐడియా ఇది. ఈ వ్యాపారం మొదట్లో కొంచెం క్లిష్టంగా అనిపించినా.. భవిష్యత్ లో మాత్రం టాప్ బిజినెస్ గా నిలబడుతుంది. మొదట్లోనే ఈ వ్యాపారంలో ప్రవేశించడం ద్వారా స్తానిక మార్కెట్లో మీ ప్రత్యేకతను నిలబెట్టుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సంపాదించే అవకాశాన్ని ఈ బిజినెస్ ఇస్తుంది. 

గమనిక: ఇక్కడ ఈ ఆర్టికల్ పాఠకుల ప్రాధమిక అవగాహన కోసం ఇచ్చాము. ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నపుడు.. అన్ని విషయాలను పూర్తిగా ఆర్ధిక సలహాదారుల వద్ద తెలుసుకుని.. మీ పరిస్థితిని బట్టి వ్యాపారాన్ని ఎన్నుకోవలసినదిగా సూచిస్తున్నాం.

Advertisment
తాజా కథనాలు