TDP Buddha Venkanna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావును సీఎం జగన్ అవమానించారన్నారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. గతంలో వైయస్ఆర్ కడప సభలో పీవీపై చెప్పులు వేయించి అవమానిస్తే ఇప్పుడు జగన్ అవమానించారని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైందని విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో ప్రెస్టేషన్ లో ఉన్న సీఎం జగన్ సెక్యూరిటీ కారు ఎక్కబోయారని కామెంట్స్ చేశారు. టీడీపీలో టికెట్ల కోసం పదిమంది పోటీ పడుతుంటే వైసీపీలో టికెట్లు అడిగే వారేలేరని వ్యాఖ్యానించారు. యాత్ర వన్ హిట్టు యాత్ర టు ఫట్ అని కౌంటర్లు వేశారు.
Also Read: గోదావరిఖనిలో దొంగల బీభత్సం.. రూ.27 లక్షలకు పైగా చోరీ..!
అనకాపల్లి పార్లమెంట్ గాని విజయవాడ వెస్ట్ గాని రెండింటిలో ఓ సీటు తనకు ఇస్తారని వెల్లడించారు. తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మవద్దని సూచించారు. తనను పక్కనపెట్టే ఆలోచన చంద్రబాబుకు లేదని.. రాబోయే 30 సంవత్సరాలు లోకేష్ కి అండగా నిలబడతానని చెప్పుకొచ్చారు. పొత్తులు ఓకే అయినా సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదని వివరించారు.
నా నాలిక అయినా కోసుకుంటాను కానీ చంద్రబాబుని మాత్రం ఎప్పుడు విమర్శించను అని పేర్కొన్నారు. అలా విమర్శించాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానని స్పష్టం చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానన్నారు. పార్టీలో ఎవరైనా టిక్కెట్టు రాలేదని చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే ఏ మాత్రం చూస్తూ ఊరుకోనని ఖరకండిగా చెప్పారు.