Buddha Venkanna: నువ్వేంటి..నీ స్థాయి ఏంటి?.. కేశినేనిపై నిప్పులు చెరిగిన బుద్దా వెంకన్న..!

కేశినేని కామెంట్స్ కు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? అంటూ ఫైర్ అయ్యారు. నువ్వేంటి..నీ స్థాయి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా..చంద్రబాబు నాతో తిట్టించలేదంటూ కామెంట్స్ చేశారు.

New Update
Buddha Venkanna: నువ్వేంటి..నీ స్థాయి ఏంటి?.. కేశినేనిపై నిప్పులు చెరిగిన బుద్దా వెంకన్న..!

Buddha Venkanna: కేశినేని కామెంట్స్ కు బుద్దా వెంకన్న గట్టి కౌంటర్ ఇచ్చారు. నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు పట్టదు..నువ్వేంటి..నీ స్థాయి ఏంటి అంటూ నిప్పులు చెరిగారు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? అంటూ మండిపడ్డారు. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా..చంద్రబాబు నాతో తిట్టించలేదంటూ కామెంట్స్ చేశారు.

కేశినేని వైసీపీ కోవర్టు

కేశినేని నానికి, కేశినేని చిన్నికి ముందు నుంచే గొడవలున్నాయన్నారు. కేశినేని చిన్నిపై పెట్టిన కేసులను చంద్రబాబు పెట్టమన్నారా? సొంత తమ్ముడి భార్యపై ఎవరైనా కేసులు పెడతారా? అంటూ ప్రశ్నించారు. కేశినేని వైసీపీ కోవర్టు అంటూ కామెంట్స్ చేశారు. కమ్మ సామాజిక వర్గంలో కొడాలి, కేశినేని నానిలు చీడ పురుగులని విమర్శించారు.

Also Read:జనసేన లోకి అంబటి రాయుడు..!

నిజయితీపై చర్చకు రా..
బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా..నీది సక్రమార్జనా? నువ్వు నిజాయితీ పరుడివా..విజయవాడకు కాపలాదారుడివా? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ నిజయితీపై, నా నిజయితీపై చర్చకు వస్తావా అంటూ బహిరంగా సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ద్వారా గెలిచావు కానీ నువ్వు సొంతంగా గెలిచావా? అంటూ ప్రశ్నించారు. కేశినేని నానికి ద ఎండ్ కార్డు పడడం ఖాయమన్నారు. కేశినేని నాని చిట్టా నా దగ్గర ఉంది..ఇక ఆట మొదలైంది..ఆడుకుందాం ఆంధ్రా రా..అంటూ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలుస్తావా?

టీడీపీ జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ అంటూ వ్యాఖ్యనించారు టీడీపీ సీనియర్ నేత  బుద్దా వెంకన్న.
కొడాలి , వంశీ అన్నేసి మాటలంటుంటే.. టీడీపీలో ఉంటూ ఒక్కరోజైనా ఖండించావా? బుద్దా వెంకన్నతో చంద్రబాబు మాట్లాడించాలా? అంటూ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలుస్తావా? కేశినేని నాని గెలిస్తే.. నా బుద్దా భవన్ ఇచ్తేస్తా..ఓడితే కేశినేని భవన్ నాకిచ్చేస్తారా..? అంటూ ప్రశ్నించారు.

ఆనాడే సస్పెండ్ చేసి ఉంటే బాగుండు

చంద్రబాబు తిట్టిన వాళ్లను నేను తిట్టకుండా ఆగను.. చంద్రబాబు ఆగమన్నా ఆగన్నన్నారు. చంద్రబాబుకు చెప్పకుండానే శ్వేతను కేశినేని నాని మేయర్ పదవికి నిలబెట్టాడని..చంద్రబాబు ఆనాడే సస్పెండ్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కేశినేని నానికి వచ్చిన ప్రొటోకాల్ ఇచ్చిందే చంద్రబాబు. చంద్రబాబు బీ-ఫాం ఇస్తేనే కదా నానికి ప్రొటోకాల్ వచ్చింది. వారం రోజుల క్రితం జగన్ మటాష్ అన్నారు.. ఇప్పుడు అదే జగన్ దేవుడయ్యారా..? అంటూ దుయ్యబట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు