TDP: జగన్ దుర్మార్గపు పాలన అంతం అవ్వడం ఖాయం.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

ఆత్మకూరులో శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి దెబ్బకి జగన్ దుర్మార్గపు పాలన అంతం అవ్వడం ఖాయమన్నారు. దళితులను వేధించడం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు.

New Update
TDP: జగన్ దుర్మార్గపు పాలన అంతం అవ్వడం ఖాయం.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Also Read: ముద్రగడ పరిస్థితి దారుణం.. అధికారుల తీరు మారకుంటే జరిగేది ఇదే..!

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికన్నా కార్పొరేషన్ రుణాలు అందాయా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై ఎన్నో దుర్మార్గమైన ఘటనలు జరిగాయని దానికి ఉదాహరణ డాక్టర్ సుధాకర్ ఉదంతమని ప్రజలకు వివరించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. తెలుగుదేశం కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు