Telangana: బీఎస్పీ మేనిఫెస్టో విడుదల.. విద్య, వైద్యం, వసతి, ఉద్యోగం, ఉపాధి అంశాలే కీలకం..

అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీఎస్పీ మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బహుజన భరోసా పేరిట తీసుకొచ్చిన ఈ ఎన్నికల ప్రమాణ పత్రంలోని ప్రతి అంశంలో బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ ఆర్ఎస్ ప్రవీణ్ మార్క్ స్పష్టంగా కనబడుతోంది. ప్రతి పౌరునికి రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన వాటినే మేనిఫెస్టోగా మలిచినట్లుగా తెలుస్తోంది. విద్య, వైద్యం, వసతి, ఉద్యోగం, ఉపాధి అంశాల చుట్టూ మేనిఫెస్టోను రూపొందించింది బీఎస్పీ.

New Update
RS Praveen Kumar: బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరిక

Telangana Elections: అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీఎస్పీ(BSP) మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బహుజన భరోసా పేరిట తీసుకొచ్చిన ఈ ఎన్నికల ప్రమాణ పత్రంలోని ప్రతి అంశంలో బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ ఆర్ఎస్ ప్రవీణ్(RS Praveen Kumar) మార్క్ స్పష్టంగా కనబడుతోంది. ప్రతి పౌరునికి రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన వాటినే మేనిఫెస్టోగా మలిచినట్లుగా తెలుస్తోంది. విద్య, వైద్యం, వసతి, ఉద్యోగం, ఉపాధి అంశాల చుట్టూ మేనిఫెస్టోను రూపొందించింది బీఎస్పీ. యువతకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు మేనిఫెస్టోలో పెద్దపీట వేసింది. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు భరోసానిచ్చే పథకాలనూ ప్రకటించింది. ఆరోగ్యానికి, పౌష్టికాహారానికి ప్రాధాన్యత కల్పించింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య, యువతకు సాంకేతిక నైపుణ్యం, భారీగా ఉద్యోగాల కల్పన, సామాన్యులు, సాధారణ గృహిణుల చేతికి టెక్నాలజీ వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

తెలంగాణ బీఎస్పీ మేనిఫెస్టో-2023ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాన్షీ యువ సర్కార్ పేరిట తెలంగాణ యువతకు అయిదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ పది లక్షల ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఏడాది మండలానికి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రతి సంవత్సరం రూ.25 వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. భీమ్ రక్షా కేంద్రాల కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్య అందిస్తామని వివరించారు. వీటితో పాటూ తెలంగాణ ప్రజలకు బీఎస్పీ ఇస్తోన్న 10 ప్రధాన హామీల గురించి ఆయన వివరించారు.

ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

బీఎస్పీ ప్రధాన హామీలు ఇవే..

1. కాన్షీ యువ సర్కార్
యువతకు ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు. అందులో మహిళలకు 5 లక్షల కొలువులు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు.

2. బహుజన రైతు బీమా
ప్రతీ పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టర్ రద్దు.

3. దొడ్డి కొమురయ్య భూమి హక్కు
భూమి లేని ప్రతీ పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి. ఆ భూమికి మహిళల పేరిట పట్టా.

4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి
మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్లు. మహిళలకు స్మార్ట్‌ఫోన్ మరియు డ్రైవింగ్ శిక్షణ. అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ.

5. భీమ్ రక్షా కేంద్రాలు
వృద్ధులకు హాస్టల్, ఆహారం మరియు ఉచిత వైద్యం. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.

6. పూలే విద్యా దీవెన
మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు. ప్రతీ మండలం నుంచి ఏటా వంద మంది విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య. డేటా ఏఐ మరియు కోడింగ్‌లో శిక్షణ.

7. బ్లూ జాబ్ కార్డ్
పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ. రోజూ కూలీ రూ.350కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత బీమా సదుపాయాలు.

8. నూరేళ్ల ఆరోగ్య ధీమా
ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య భీమా. ఏటా రూ.25 వేల కోట్లతో పౌష్టికాహార ఆరోగ్య బడ్జెట్.

9. వలస కార్మికుల సంక్షేమ నిధి
రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు. వలస కార్మికులకు వసతి. గిగ్ కార్మికులు, లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.

10. షేక్ బందగి గృహ భరోసా
ఇళ్లు లేని వారికి 550 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు. ఇళ్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల సాయం. ఇంటి పునర్మిణానికి రూ.1.50 లక్షల సాయం.

ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు