రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే నోటీసులు ఇవ్వండి.. బిఆర్ఎస్ ఎంపీ షాకింగ్ కామెంట్స్.! రైతుబంధు వెనక్కి తీసుకోవడం వల్ల 4 కోట్ల మంది ప్రజలు సఫర్ అవుతున్నారని బీఆర్ఎస్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు తెలిపారు. "రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వండి..అంతే కానీ, రాజకీయనేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకండి " అని కోరారు. By Jyoshna Sappogula 27 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rythu Bandhu: రైతుబంధు పార్టీలకు సంబంధించినది కాదని చెప్పారు బిఆర్ఎస్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు. ఇది కేవలం రైతులకు సంబంధించినది.. అన్నీ పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చారు. రైతు బంధుకు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు వెనక్కు తీసుకోవడం వల్ల 4కోట్ల మంది ప్రజలు సఫర్ అవుతున్నారని వెల్లడించారు. ఈ అంశాన్ని పరిశీలించాలి అని ఈసీనీ కోరామని తెలిపారు. ఈ క్రమంలోనే రైతు బంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వండి..అంతే కానీ, ఇలా రైతు బందును ఎలా అపుతారు? అని ప్రశ్నించారు. రైతు బంధు ఆన్ గోయింగ్ స్కీం అని..ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అపుతారని అడిగారు. రాజకీయనేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదని అన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు బందును కాంగ్రెస్ వాళ్లు ఆపారు అని నేను అనడం లేదని స్పష్టం చేశారు. ECI తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్యనించారు. కోర్టుకు వెళ్లేందుకు టైమ్ లేదని..మేము రేపటి వరకు విత్ డ్రా చేపించే ప్రయత్నం చేస్తామని కామెంట్స్ చేశారు. ఒకవేళ ఇలా కుదరలేదంటే.. రైతులు అర్థం చేసుకోవాలని.. రెండు మూడు రోజులు ఓపిక పెట్టాలి అని వివరించారు. Also Read : అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్ రావు ఫైర్.. కాగా, తెలంగాణలో రాజకీయం మొత్తం రైతు బంధు చుట్టే తిరుగుతూ ఉంది. ఎన్నికల వేళ రైతు బంధు, దళిత బంధు నిధులు విడుదల అనుమతి ఇవ్వొద్దు అంటూ గతంలో ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు ముందు ఈ నగదు పంపిణీ చేయడం ద్వారా ప్రజలను ప్రలోభానికి గురవుతారని పేర్కొంది. కావాలంటే రైతు బంధును నవంబర్ 2వ తేదీకి ముందే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతిని ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ ను కోరారు. ఈ నేపథ్యంలో ఈసీ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు నాడు మీ మొబైల్ ఫోన్లు టింగ్ టింగ్ అంటూ రైతు బంధు డబ్బులు జమ అవుతాయని అన్నారు. మంత్రి హరీష్ రావు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని తాజాగా ఈసీ రైతు బంధు నిధులకు బ్రేక్ వేసింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ చేసిన పనే అంటూ ధ్వజమెత్తింది. ఇదిలా ఉండగా రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని మరోసారి బీఆర్ఎస్ పార్టీ కోరింది. తాము ఎలాంటి ఉల్లంఘనలు చేయలేదని పేర్కొంది. రైతు బంధు కొత్త పథకం కాదని.. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ప్రోగ్రాం అని పేర్కొంది. మరి బీఆర్ఎస్ పార్టీ విన్నపాన్ని ఈసీ అంగికరించి రైతు బంధు నిధుల విడుదలకు అనుమతిని ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. #rythu-bandhu-scheme #telanaga-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి