TS Politics: బీజేపీ గూటికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ? అంతా ఊహించినట్లుగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ హైకమాండ్ ఆయనను వరంగల్ నుంచి ఆయన ఎంపీగా బరిలోకి దించే అవకాశం ఉంది. By Nikhil 17 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Aroori Ramesh Joined in BJP: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన ఈ రోజు బీజేపీలో చేరారు. వరంగల్ (Warangal) ఎంపీగా బీజేపీ నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆరూరి రమేష్ 2014, 2018 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరిపోయారు. రమేష్ పార్టీ మారకుండా బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రంగంలోకి దిగి చర్చలు జరిపారు. అయినా.. రమేష్ పార్టీ మారేందుకే మొగ్గు చూపారు. రమేష్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట నాయకులు పార్టీ మారకుండా బీఆర్ఎస్ పెద్దలు చర్యలు చేపట్టారు. #telangana-politcs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి