Bride Groom: పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన పెళ్లి కొడుకు.. ఇంతలోనే..!

వరంగల్ లో వరుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి అదృశ్యమైన హనుమకొండకు చెందిన కృష్ణ తేజ్ మృతి చెందాడు. ఈ నెల 16న నర్సంపేటకు చెందిన యువతితో కృష్ణతేజకు వివాహం నిశ్చయించారు. యువకుడి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Bride Groom: పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన పెళ్లి కొడుకు.. ఇంతలోనే..!
New Update

Bride Groom Krishna Tej : వరంగల్ లో విషాదం చోటుచేసుకుంది. వరుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి అదృశ్యమైన వరుడు కృష్ణ తేజ చివరికి శవమై కనిపించాడు. అయితే, వరుడు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  కృష్ణ తేజ.. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడా?  లేదంటే ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: భర్తకు కావ్య విడాకులు… పంచాయితీ పెట్టిన అనామిక, ధాన్యలక్ష్మీ.. ఇందిరాదేవి ప్లాన్ ఫలిస్తుందా..?

స్థానికుల సమాచారం ప్రకారం.. హనుమకొండకు చెందిన కృష్ణ తేజ్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 16న నర్సంపేటకు చెందిన యువతితో కృష్ణతేజకు వివాహం నిశ్చయించారు. అయితే, వరుడు వేరే యువతిని ప్రేమించాడని.. అతడి ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని ..వేరే యువతితో పెళ్లి నిశ్చయించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణ తేజ్ అదృశ్యమైయ్యాడు.

Also Read: బెంగళూరు కేఫ్‌లో పేలుడు.. ఎన్‌ఐఏ అదుపులో అనుమానితుడు!

ఆదివారం సాయంత్రం నుండి కృష్ణతేజ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్లు తెలుస్తోంది. భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు కృష్ణ తేజ్ పై  కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన  పోలీసులు పలివెల్పుల SRSP కెనాల్ వద్ద వరుడు బైక్ ను గుర్తించారు. వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు SRSP కెనాల్ లో కృష్ణ తేజ మృతదేహం లభ్యమయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 4 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు విగితా జీవిగా కనిపించడంతో విషాద చాయాలు అలుముకున్నాయి.

#bride-groom-krishna-tej
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe