Recipe: పిల్లల కోసం టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇష్టంగా తింటారు👌 సాధారణంగా పిల్లలు రకరకాల ఆహార పదార్థాలు తినాలని డిమాండ్ చేస్తారు. అయితే ఈ సారి పిల్లలు కోసం కొత్తగా, వైరైటీగా బ్రెడ్ పోహా ట్రై చేయండి. దీన్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేయవచ్చు. రెసిపీ పూర్తి విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 05 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Recipe: సెలవుల్లో పిల్లలు రకరకాల ఆహార పదార్థాలు తినాలని డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ పిల్లలు మరింత సెలెక్టివ్ గా ఉంటారు. రోజు రొటీన్ గా పెడితే తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో, అల్పాహారం కోసం భిన్నమైన, రుచికరమైన బ్రెడ్ పోహా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.. బ్రెడ్ పులావ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు. నూనె - 2 టేబుల్ స్పూన్లు ఆవాలు - 1 టీస్పూన్ పచ్చిమిర్చి - 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ - 60 గ్రాములు ఉప్పు - 1/2 టీస్పూన్ పసుపు - 1/4 tsp ఎర్ర మిరపకాయ - 1/4 tsp ధనియాల పొడి - 1/4 tsp గరం మసాలా - 1/4 టీస్పూన్ టొమాటో - 60 గ్రాములు క్యాప్సికమ్ - 60 గ్రాములు నీరు సరిపడినంత బ్రెడ్ ముక్కలు - 120 గ్రాములు కెచప్ - 1 టేబుల్ స్పూన్ కాల్చిన వేరుశెనగ - సరిపడ టేస్టీ బ్రెడ్ పులావ్ తయారీ విధానం బ్రెడ్ పోహా తయారు చేయడానికి ముందుగా.. పాన్ లో 2 టేబుల్ స్పూన్ల వేసి కాస్త వేడెక్కిన తర్వాత.. దాంట్లో 1 టీస్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉల్లిపాయ వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఉప్పు, పసుపు, ఎర్ర కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేయించిన ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు కొన్ని నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత దాంట్లో కాస్త కెచప్ వేయండి. ఆ తర్వాత 3-4 నిమిషాలు పాటు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. అంతే హాట్ టేస్టీ బ్రెడ్ పోహా రెడీ. ఇప్పుడు వేయించిన వేరుశెనగలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. Also Read: Aloo Onion Pakora: హాట్ హాట్ గా ఆలూ ఆనియన్ పకోడీ.. అదిరిపోతుంది #bread-pulao-recipe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి