Janasena Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ అండ్ బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు.
Also Read: వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన మంత్రి బొత్స.. మా పార్టీ విధానం ఇదే..!
అవాంతరాలు
కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేసే తేదీలను త్వరలో వెల్లడిస్తారు. నేటి నుంచి నుంచి నాలుగు రోజులపాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేశారు.
Also Read: ఏపీ రాజకీయాల్లోకి కొత్త నేతలు రాక.. మంత్రి విడదల రజినీకు ధీటుగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!
దుర్మార్గం
అయితే, పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన అడ్డుకోవడం దుర్మార్గమని జనసేన నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్మోహన్ రెడ్డికి హెలిక్యాప్టర్ వెళ్లొచ్చు కానీ పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లటానికి మాత్రం అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని అనుమతులు రద్దు చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ అంటే ఏ స్థాయిలో భయపడుతున్నారో రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుందన్నారు. గతంలో లేని ఇబ్బందులు పవన్ కళ్యాణ్ పర్యటనంగానే ఎందుకు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు లేని ఇబ్బంది స్థానిక రెవిన్యూ అధికారులకు ఎందుకు వచ్చింది? అని నిలదీస్తున్నారు.