Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రకు బ్రేక్

నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రకు ఒక వారం విరామం ప్రకటించారు. హెరిటేజ్ సంస్థ పనుల కోసం బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యకలాపాలను సైతం సమీక్షించనున్నారు.

Nara Bhuvaneshwari: జగన్‌ పాలనలో మహిళలకు భద్రత కరవు.. భువనేశ్వరి ఆగ్రహం
New Update

Nara Bhuvaneswari: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ వార్త విని చంద్రబాబు అభిమనులు, టీడీపీ కార్యకర్తలు పలువురు మృతి చెందారు. దాంతో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అండగా నిలుస్తూన్నారు. నిజం గెలవాలి యాత్ర పేరిట బాధిత కుటుంబాలను కలుస్తూ వారికి భరోసాను కలిగిస్తున్నారు. ఇప్పటికి వరకు 149 బాధిత కుటుంబాలను పరామర్శించి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. 66 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,092 కిలోమీటర్ల మేర నారా భువనేశ్వరి పర్యటించారు.

Also Read: దేవుడికి పూజలు ఎందుకు చేయాలి.. బిగ్ బాస్ ఫేమ్ కీర్తి షాకింగ్ కామెంట్స్

అయితే, నిర్విరామంగా సాగుతున్న నిజం గెలవాలి కార్యక్రమానికి భువనేశ్వరి ఒక వారం విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఈ వారంలో జరిగే బోర్డు మీటింగ్స్ కు ఆమె హాజరు కావాల్సి ఉండడంతో బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిజం గెలవాలి కార్యక్రమం కారణంగా భువనేశ్వరి పూర్తి సమయం పర్యటనలకే కేటాయిస్తున్నారు. జిల్లాకు వెళ్లిన ప్రతి సారీ 4 నుంచి 5 రోజులు అక్కడే ఉండాల్సి పరిస్థితి వస్తోంది. దీంతో హెరిటేజ్ ఎండీగా నిర్వర్తించాల్సిన పనులకు నారా భువనేశ్వరి సమయం కేటాయించాల్సి వస్తోంది.

Also Read: మంచూరియా లవర్స్ కి షాక్.. గోబీ బ్యాన్.. ఎందుకంటే?

ఈ కారణంగా ఒక వారం పాటు విరామం ఇచ్చి ఆ పనులు చూసుకోనున్నట్టు నారా భువనేశ్వరి తెలిపారు. వీటితో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యకలాపాలను సైతం సమీక్షించుకునేందుకు ఆమె సమయం వెచ్చించనున్నారని సమాచారం. మళ్లీ వచ్చేవారం నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం యధావిధిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

#nara-bhuvaneshwari
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe