Brahmamudi Serial: భార్య కోసం నిప్పుల పై చేయి పెట్టిన రాజ్.. భర్త కోసం విలవిలలాడిపోతున్న కావ్య ..!

రాజ్ చేయికి గాయం కావడంతో విలవిలలాడిపోతుంది కావ్య. మరో వైపు క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికి రుద్రాణి డబ్బులు ఇవ్వకపోవడంతో.. అత్తతో గొడవ పడుతుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial: భార్య కోసం నిప్పుల పై చేయి పెట్టిన రాజ్.. భర్త కోసం విలవిలలాడిపోతున్న కావ్య ..!
New Update

Brahmamudi Serial: అత్తారింట్లో రాజ్ ఎలా ఉన్నాడని పరామర్శించడానికి కాల్ చేస్తుంది శ్వేతా . ఇది అత్తారిల్లులా లేదు, అండమాన్ జైలులా ఉంది అని వెటకారంగా సమాధానం చెప్తాడు రాజ్. దీంతో శ్వేత మరి అంత ఇబ్బంది ఉంటే తిరిగి వచ్చేయొచ్చు కదా అని రాజ్ ను ఆటపట్టిస్తుంది. అదేమీ లేదు వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు.. కానీ ఆ బావగాడే నచ్చట్లేదు అని చెప్తాడు. publive-image

రాజ్ ఉద్దేశం ఏంటో అర్ధం చేసుకున్న శ్వేత .. కావ్య బావ ఎక్కడ నీ భార్యకు ఎక్కడ ప్రపోజ్ చేస్తాడో అనే టెన్షన్ , జెలసీతో మాత్రమే నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆ విషయం నాకు ఎప్పుడో అర్థమైంది అని అంటుంది. భార్య పై ప్రేమను బయట పెట్టడానికి ఈగో అడ్డొస్తున్న రాజ్ అదేమీలేదు అని కవర్ చేస్తాడు.

publive-image

మరో వైపు రాజ్ శ్వేతతో మాట్లాడం గమనించిన కావ్య మళ్ళీ బాధపడుతుంది. దీంతో అప్పు.. నువ్వు కూడా అలానే చేసి బావను ఏడిపించు అక్క అని చెప్తుంది. ఒకరి ప్రేమను పొందడానికి.. మన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోకూడదు అని అప్పుకు హిత భోద చేస్తుంది కావ్య.

publive-image

ఆ తర్వాత కావ్య , తన బావ, కుటుంబం అంతా కలిసి చలి మంట వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. రాజ్ రాగానే కావాలనే తనను రెచ్చగొట్టడానికి.. బావతో కలిసి డాన్స్ వేస్తుంది కావ్య.

publive-image

భార్య తన బావతో డాన్స్ వేయడంతో జెలసీగా అవుతాడు రాజ్. మంట ముందు డాన్స్ చేస్తున్న క్రమంలో అక్కడున్న నిప్పు పై కాలు పెట్టడానికి వెళ్తుంది కావ్య. ఇది గమనించిన రాజ్ భార్య కాలికి గాయమవుతుందని తన చేయి అడ్డు పెడతాడు.

publive-image

రాజ్ చేయి కాలిపోవడంతో విలవిలలాడిపోతుంది. భర్త ముందు తనంటే ఇష్టం లేనట్లు నాటకం ఆడుతున్న కావ్య.. రాజ్ కు గాయమవడంతో తెగ టెన్షన్ పడిపోతుంది. వీరిద్దరి ప్రేమను చూసి కావ్య బావ, కనకం సంతోషపడతారు.

publive-image

గొప్ప కవి కావాలనే పట్టుదలతో తన కవితలు పట్టుకొని బయటకు వెళ్లిన కళ్యాణ్ తిరిగి ఇంటికి వస్తాడు. కళ్యాణ్ ఇంటికి రాగానే.. నీ ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయని అడుగుతాడు ప్రకాశం. దీంతో కళ్యాణ్ ఇది సినిమా కాదు నాన్న.. వెళ్ళగానే పనులు అవ్వడానికి కొంత సమయం పడుతుంది అని చెప్తాడు. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన అనామిక అది ఎప్పటికీ జరగని పనిలే అని వెటకారం చేస్తుంది.

publive-image

మరో వైపు లక్ష రూపాయలు కావాలని రుద్రాణిని డబ్బులు అడుగుతుంటాడు రాజ్. రుద్రాణి మాత్రం నాతో లేవు, నేను ఇవ్వనని కొడుకుకు గడ్డి పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న.. క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికి డబ్బులు కావాలని అడుగుతుంది. దీంతో రుద్రాణి, స్వప్న ఇద్దరి మధ్య గట్టిగా వాదన జరుగుతుంది. ఏం చేసిన డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్తుంది రుద్రాణి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు.. అందరూ వెయిట్ చేస్తున్న ఆ సినిమా కూడా

#brahmamudi-serial-today-episode
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe