Brahmamudi Serial: భర్తకు విడాకులు ఇచ్చేసిన కావ్య.. కావ్య పై రాజ్ ప్రేమను బయటపెడతాడా..?

భర్త రాజ్ కు విడాకులు పేపర్స్ ఇస్తుంది కావ్య. భార్య విడాకులు కావాలని అడగడంతో రాజ్ షాకవుతాడు . మరో వైపు ఇష్టంలేకపోయిన భర్త రాజ్ కు విడాకులు ఇచ్చిన కావ్య బాధతో ఏడుస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial: భర్తకు విడాకులు ఇచ్చేసిన కావ్య.. కావ్య పై రాజ్ ప్రేమను బయటపెడతాడా..?
New Update

Brahmamudi Serial: ఇంట్లో ధాన్యలక్ష్మీ, అనామిక రచ్చ చేయడంతో.. అప్పును ఎందుకు కలిసావు.. ఇలా మా కుటుంబాన్ని నానా మాటలు అనేలా ఎందుకు చేస్తున్నావు అని కళ్యాణ్ ను నిలదీస్తుంది కావ్య. దీంతో కళ్యాణ్ పెళ్ళికి ముందు నుంచే అప్పు నాకు ఫ్రెండ్.. అందులో తప్పేమి ఉంది అని చెప్తాడు. కానీ అనామిక, ధాన్యలక్ష్మి అత్తయ్య మాత్రం దీన్ని తప్పుగానే చూస్తున్నారు అంటూ కళ్యాణ్ కు నీతులు చెప్తుంది కావ్య.

publive-image

ఆ తర్వాత రాజ్ కోసం కావ్య కాఫీ తీసుకొని వస్తుంది. ఇంతలో రాజ్ కొంత డబ్బు తీసి కావ్య చేతికి ఇస్తాడు. దీంతో కావ్య ఏంటిది అని అడుగుతుంది. ఆఫీస్ లో డిజైన్స్ వేశావు కదా.. అందుకే ఈ డబ్బు అని అంటాడు. దానికి జీతం ఇస్తారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వడం అని అంటుంది కావ్య. అంటే నీకు పాస్ పోర్ట్ వచ్చింది కదా.. జీతం ఇచ్చేలోపు అమెరికా వెళ్ళిపోతావు. అందుకే ఇస్తున్నాను అని కావ్యకు షాకిస్తాడు రాజ్.

publive-image

రాజ్ ఇలా డబ్బు ఇచ్చిన విషయాన్ని ఇందిరాదేవితో చెప్తుంది కావ్య. ఆయన నన్ను అమెరికా పంపించాలని చూస్తున్నారు. ఇంక ఆయన మారతాడనే నమ్మకం లేదు అని ఇందిరాదేవితో బాధపడుతుంది కావ్య.  దీంతో..  నువ్వు వెళ్లిపోతానని చెప్పగానే తట్టుకోలేక.. వాడు ఇదంతా చేస్తున్నాడు అని కావ్యకు దైర్యం చెప్తుంది ఇందిరాదేవి.

publive-image

ఇందిరాదేవి విడాకుల పై సంతకం పెట్టడానికి కావ్యను ఒప్పిస్తుంది. నీ భర్త ప్రేమను పొందాలంటే ఇది సరైన అవకాశం అని చెప్తుంది. నువ్వు దూరమవుతున్నావని తెలిస్తే.. ఖచ్చితంగా వాడి ప్రేమను బయటపెడతాడు. అందుకే ఈ విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టు అని చెప్తుంది.

publive-image

ఎలాగైన సరే భర్త ప్రేమను పొందాలని నిర్ణయించుకున్న కావ్య.. ఇందిరాదేవి చెప్పినట్లు విడాకుల పేపర్స్ పై సంతకం పెడుతుంది. అందరినీ విడదీసే ఈ కాగితాలు.. మమల్ని కలుపుతాయంట... అని క్రిష్నయ్యతో బాధపడుతుంది.

publive-image

విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టిన వాటిని తీసుకొని రాజ్ దగ్గరకు వెళ్తుంది. కానీ లోపలి వెళ్లకుండా బయటే నిల్చున్న కావ్య.. రాజ్ ను గట్టిగా పట్టుకొని తన ప్రేమను బయట పెట్టినట్లు ఊహించుకుంటుంది.

publive-image

కావ్య రాజ్ తో ప్రేమను చెప్పినట్లు ఊహించుకుంటూ ఉండగా.. రాజ్ ఏంటీ అక్కడే నిలబడ్డావు అని అడుగుతాడు. దీంతో కావ్య లోపలి వస్తుంది. తనకు విడాకులు కావాలని రాజ్ చేతికి పేపర్స్ ఇస్తుంది. కావ్య ఇలా చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Surekha Vani: ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి

#brahmamudi-serial #brahmamudi-serial-today-episode
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe