Brahmamudi Serial: భర్తకు కావ్య విడాకులు... పంచాయితీ పెట్టిన అనామిక, ధాన్యలక్ష్మీ.. ఇందిరాదేవి ప్లాన్ ఫలిస్తుందా..?

కావ్యతో విడాకులు పేపర్స్ పై బలవంతంగా సంతకం పెట్టిస్తుంది ఇందిరాదేవి. ఆ పేపర్స్ తీసుకెళ్లి రాజ్ ను విడాకులు కావాలని అడుగుతుంది కావ్య. మరో వైపు అప్పును తన భర్తతో చూసిన అనామిక కనకం ఇంటికి వెళ్లి పంచాయితీ పెడుతుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial: భర్తకు కావ్య విడాకులు... పంచాయితీ పెట్టిన అనామిక, ధాన్యలక్ష్మీ.. ఇందిరాదేవి ప్లాన్ ఫలిస్తుందా..?
New Update

Brahmamudi Serial: రాజ్ లో ప్రేమను బయట పెట్టేందుకు కావ్య, తన బావ వేసిన ప్లాన్ రివర్స్ అవుతుంది. తన బావతో కలిసి సంతోషంగా అమెరికా వెళ్లిపొమ్మని కావ్యకు పాస్ పోర్ట్ ఇస్తాడు రాజ్. తన బావతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టమని చెప్తాడు. దీంతో కావ్య షాకవుతుంది. ఇక రాజ్ లో మార్పు రాదనీ భావించిన కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.

publive-image
రాజ్ కావ్యను వెళ్ళమని చెప్పడంతో.. రాజ్ లోని అంతరాత్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కావ్యను ఇన్ని రోజులు దూరం పెట్టావు.. ఇప్పుడేమో అమెరికా పంపుతున్నావు నువ్వు చేసేది తప్పు అని రాజ్ ను హెచ్చరిస్తుంది. నేను కోరుకోనిది నాకెందుకు అని తన అంతరాత్మతో చెప్తాడు రాజ్.

publive-image
మరో వైపు అప్పును తన భర్త కళ్యాణ్ తో చూసిన అనామిక, అత్త ధాన్యలక్ష్మి .. కనకం ఇంటికి వెళ్లి పంచాయితీ పెడతారు. నీ కూతురు ఇంకోసారి నా భర్తతో కనిపిస్తే మర్యాదగా ఉండదు అని కనకానికి వార్నింగ్ ఇస్తుంది అనామిక. కళ్యాణ్ మంచితనం అడ్డుపెట్టుకొని .. నా భర్తను తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది అని అప్పు పై నిందలు వేస్తుంది.

publive-image
అప్పు పై అలా నిందలు వేయడం తట్టుకోలేకపోయిన ధాన్యలక్ష్మి.. తన కూతురి గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అనామిక, ధాన్యలక్ష్మికి తిరిగి కౌంటర్ ఇస్తుంది.

publive-image
కావ్య పై రాజ్ లోని ప్రేమను బయటకు తీసుకురావడానికి చివరి అస్త్రం ప్రయోగిస్తోంది ఇందిరాదేవి. కావ్య చేత రాజ్ విడాకులు ఇప్పించాలని ప్లాన్ చేస్తుంది. బలవంతంగా కావ్యతో విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టించాలని అనుకుంటుంది. కానీ కావ్య మాత్రం దీనికి ఒప్పుకోదు. ఈగోతో రాజ్ నిజంగానే సంతకం పెటేస్తే నా జీవితం నాశనం అవుతుంది అని భయపడుతుంది.

publive-image

ఇందిరాదేవి మాత్రం కావ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. రాజ్ కు నీ పై చాలా ప్రేమ ఉంది. విడాకులు ఇవ్వడానికి ఖచ్చితంగా ఒప్పుకోడు. రాజ్ లో నీ పై ప్రేమను బయటకు రప్పించడానికి ఇదే సరైన మార్గం అని కావ్యకు చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Operation Valentine: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

#brahmamudi-serial #brahmamudi-serial-today-episode
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe