Brahmamudi Serial: రాజ్‌ శ్వేత రిలేషన్‌.. కావ్యకు క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్..!

బ్రహ్మముడి సీరియల్ లో అపర్ణ, ధాన్యలక్ష్మీ ఇద్దరి మధ్య తమ భర్తలు సుభాష్, ప్రకాశం ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు రాజ్‌కు శ్వేత క్లాస్ మెట్ అని కావ్యకు చెబుతాడు కళ్యాణ్. దీంతో వారిద్దరికి ఏ సంబంధం ఉండదని కావ్యకు అర్థమవుతుంది.

Brahmamudi Serial: రాజ్‌ శ్వేత రిలేషన్‌.. కావ్యకు క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్..!
New Update

Brahmamudi Serial: శ్వేతతో రాజ్ ఉన్న విషయాలను గుర్తు చేసుకుంటూ తనలో తాను బాధపడుతుంది కావ్య. ఇంటి ముందు మంచులో కూర్చుని కుమిలిపోతుంటుంది. ఇంతలో అక్కడికి భర్త రాజ్ వస్తాడు. పక్కన కూర్చుని ఒంట్లో బాగోలేదట.. నీరసంగా ఉన్నావట అని అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉన్నానని కావ్య అంటుంది. హాస్పిటల్‌కు వెళ్లావట కదా.. డాక్టర్ ఏమన్నారని అడుగుతాడు. మందులు రాసి ఇచ్చారని చెబుతుంది. మంచులో ఎందుకు కూర్చున్నావ్ రెస్ట్ తీసుకోవచ్చు కదా అని రాజ్ అంటాడు..లేచి వెళ్లిపోతుంది కావ్య. ఆఫీస్ లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని అంటాడు.

publive-image

అపర్ణ ఎమోషనల్

మరోవైపు ధాన్యలక్ష్మీ మాటలకు అపర్ణ చాలా ఫీల్ అవుతుంటుంది. అప్పుడే భర్త సుభాష్ వస్తాడు..ఏం జరిగింది అంటూ ఆరా తీస్తాడు..దీంతో మీ తమ్ముడు భార్యకు స్వార్ధం పెరిగిపోయింది. కళ్యాణ్ ను నేను ఎప్పుడు నా చిన్న కొడుకు లానే చూసుకున్నాను..కానీ ధాన్యలక్ష్మీ తన కొడుకుని సర్వెంట్ లాగా చూస్తున్నావ్ అంటూ మాటలు అనిందని చెబుతుంది. దీంతో తన భర్త ఆమెను ఓదారుస్తాడు. కళ్యాణ్ కి ఇప్పుడు పెళ్లి అయింది..తన భార్య ముందు అతడికి పనులు చెబితే చిన్న చూపు అవుతాడని ధాన్యలక్ష్మీ అలా అని ఉంటుందని నచ్చచెబుతాడు.

publive-image

ధాన్యలక్ష్మీ కన్నెర్ర

ప్రకాశం రూంలో ఉండి లాప్ టాప్ లో ఏదో చూస్తుండగా భార్య ధాన్యలక్ష్మీ తనకు కడుపు మండిపోతుంది అని అంటుంది. తన మాటలను భర్త సరదాగా తీసుకుంటాడు. ఇంట్లో అందరూ కళ్యాణ్ ను చిన్నచూపు చూస్తున్నారని..వాడికి విలువ ఇవ్వడం లేదని తన బాధను చెప్పుకుంటుంది. అలా ఏమీ ఉండదని భర్త అంటాడు. ధాన్యలక్ష్మీ, అపర్ణ ఇంట్లో ఎలా ఉన్నా..ప్రకాశం, సుభాష్ మాత్రం ఏమీ పట్టించుకోరు..వీళ్ల గొడవలు మాములే అన్నట్లుగా ఉంటారు.

publive-image

క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్

ఇదిలా ఉండగా కావ్య దగ్గరికి వచ్చిన కళ్యాణ్ ఏమైంది వదినా.. ఈ మధ్య ఏదో కోల్పోయినట్లు దిగులుగా కనిపిస్తున్నావని అడుగుతాడు. అప్పుడు కావ్య తన సెల్ ఫోన్ లో ఉన్న రాజ్ శ్వేత వీడియోను చూపిస్తుంది. తను శ్వేత వదినా..అన్న క్లాస్ మెట్ ..నేను జూనియర్ అని చెబుతాడు. శ్వేత గురించి మీకు తెలుసా? వారిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉంది అని కావ్య అడిగుతుంది. శ్వేత అన్నని ప్రేమించింది వదినా..పెళ్లి చేసుకోవాలని అనుకుంది..కానీ కుదర్లేదు అని అంటాడు.

publive-image

మరి మీ అన్న ప్రేమించాడా? అని అడిగితే ..తను ప్రేమించింటే అడ్డుచెప్పే వాళ్లు ఎవరూ లేరు కదా వదినా అని అంటాడు. దీంతో శ్వేతకు రాజ్ కు ఏ సంబంధం ఉండదని కావ్యకు తెలుస్తుంది.

Also Read: డిలీట్ చేసిన రష్మిక సీన్స్‌ను కూడా చూడవచ్చు.. యానిమల్‌ ఓటీటీ డేట్‌ ఫిక్స్!

#brahmamudi-serial-today-episode #brahmamudi-serial-kavya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe