Brahmamudi Serial: కావ్య ఆఫీస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. రాజ్ చేతుల మీదుగా కావ్యకు ఆఫర్ లెటర్ ఇవ్వాలని తండ్రి సుభాష్ ఆర్డర్ వేశారు. ఇక తండ్రి మాట కోసం ఇష్టం లేకపోయిన భార్యకు ఆఫర్ లెటర్ అందించి ఆఫీస్ లోకి వెల్కమ్ చెప్పాడు.
కావ్య ఆఫీస్ కు రావడం ఇష్టంలేని రాజ్ ఆమెను వీలైనంత త్వరగా అక్కడి నుంచి పంపించేయాలని చిరాకు పడుతూ మనసులో తిట్టుకుంటాడు. ఆ తర్వాత కావ్య చెప్పినట్లు శృతి డిజైన్స్ వేయడంతో.. రాజ్ శృతి పై సీరియస్ అవుతాడు. చెప్పినట్లు చేయకపోతే జాబ్ లో నుంచి తీసేస్తాను అంటూ శ్రుతిని హెచ్చరిస్తాడు.
కొత్త కోడలు అనామిక భర్త కళ్యాణ్ ఇద్దరు సరదాగా లంచ్ చేయడానికి రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ కూడా భర్తను ఆఫీస్ కు వెళ్ళమని కాల్చుకు తింటుంది అనామిక. ఇంతలో అక్కడ డెలివరీ కోసం వచ్చిన అప్పును చూసిన అనామిక కావాలనే భర్తతో మరింత క్లోజ్ గా, ప్రేమగా మాట్లాడుతుంది. ఇది చూసిన అప్పు కన్నీళ్లు పెట్టుకుంది.
ఆఫీసులో ఉన్న రాజ్ కు సడన్ గా కాల్ చేసిన శ్వేతా.. తన భర్త అరవింద్ వచ్చాడు.. చాలా భయంగా ఉంది అని చెప్పగానే.. వెంటనే వస్తున్నానని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది విన్న కావ్య రాజ్ ను ఫాలో అవుతూ వెళ్తుంది.
Also Read: Brahmamudi Serial: ఆఫీస్ లోకి కావ్య గ్రాండ్ ఎంట్రీ .. కుళ్ళుకొని చస్తున్న అత్తాకోడళ్ళు
ఇంతలో శ్వేతా ఇంటికి ఎంట్రీ ఇచ్చిన భర్త అరవింద్.. ఆమెను కొడుతూ సైకోలా బిహేవ్ చేస్తాడు. ఆస్తి నా పేరు మీద రాయాలని బెదిరిస్తాడు. వెంటనే అక్కడికి వచ్చిన రాజ్ శ్వేతా భర్త అరవింద్ ను కొడతాడు. ఇది చూసిన అరవింద్ మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానిస్తాడు.
అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక.. శ్వేతా ఏడుస్తూ ఉంటుంది. నీకు నేను ఉన్నాను.. నీ బాధ్యత నాది అంటూ రాజ్ శ్వేతకు దైర్యం చెప్తాడు. బాధలో ఉన్న శ్వేతా రాజ్ భుజం పై తల పెట్టి ఏడుస్తూ ఉంటుంది.
భర్తను ఫాలో అవుతూ వచ్చిన కావ్య ముందు జరిగిన విషయాలు తెలియక.. పరాయి అమ్మాయితో తన భర్త చెప్పిన మాటలు, అంతా దగ్గరగా ఉండడం చూసి గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇక నిజం తెలియని కావ్య భర్తను ఏం చేయబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సింది.