Bosta: ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంపై బొత్స ఎమన్నారంటే? పీఆర్సీ ఆలస్యమైనప్పుడే మధ్యంతర భృతి ఇస్తారని.. పూర్తిస్థాయిలో పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక మధ్యంతర భృతి ఎందుకు? అని ప్రశ్నించారు మంత్రి బొత్స. మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని చెప్పారు. By Jyoshna Sappogula 23 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Botsa Sathyanarayana: ఏపీ మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. పూర్తిస్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదే విషయం ఉద్యోగులకు కూడా తెలిపినట్లు వెల్లడించారు. పీఆర్సీ ఆలస్యమైనప్పుడే మధ్యంతర భృతి ఇస్తారని.. పూర్తిస్థాయిలో పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక మధ్యంతర భృతి ఎందుకు? అని ప్రశ్నించారు. Also Read: టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష్ణ అరెస్ట్.. కారణం ఇదే..! మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని తేల్చిచెప్పారు. ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే అప్పుడు మధ్యంతర భృతి గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఇక, మార్చి లోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరామని తెలిపారు. Also Read: అక్రమ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ, జనసేన ఆందోళనలు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.4,831 కోట్ల పెండింగ్ బకాయిలు మార్చి చివరి నాటికి ఇస్తామని చెప్పారని అన్నారు. పీఆర్సీ చెల్లింపులు కూడా రూ.14,102 కోట్లు చెల్లిస్తామన్నారని వెల్లడించారు. పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాల్సిన పీఆర్సీ పాత బకాయిలు ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలో లెక్కలు తీసుకుని తదుపరి సమావేశంలో ప్రకటన చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందని పేర్కొన్నారు. గతంలో అమల్లో ఉన్న ఐఆర్ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారని..ఈ జులై లోపే పీఆర్సీని సెటిల్ చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని బొప్పరాజు వివరించారు. #botsa-sathyanarayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి