Alka Yagnik : వినికిడి కోల్పోయిన ప్రముఖ లేడీ సింగర్.. ఆ వ్యాధి వల్లే అంటూ ఆవేదన!

ప్రముఖ బాలీవుడ్ లేడీ సింగర్ అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడింది.ఈ వ్యాధితో ఏకంగా తన వినికిడి కోల్పోయిందట. ఈ విషయాన్ని అల్కా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి...

New Update
Alka Yagnik : వినికిడి కోల్పోయిన ప్రముఖ లేడీ సింగర్.. ఆ వ్యాధి వల్లే అంటూ ఆవేదన!

Alka Yagnik Suffering With A Rare Disease :  ప్రముఖ బాలీవుడ్ లేడీ సింగర్ (Bollywood Singer) అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడింది.ఈ వ్యాధితో ఏకంగా తన వినికిడి కోల్పోయిందట. ఈ విషయాన్ని అల్కా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా అనుకోని వైరల్ ఎటాక్ కారణంగానే వ్యాధి బారిన పడ్డానని, సోకే వరకు దీని గురించే తెలియదని ఎమోషనల్ అయిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సింగర్ అల్కా యాగ్నిక్ (Alka Yagnik) సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌తో బాధపడుతోంది.

దీని గురించి తాజాగా తన ఇన్ స్టా పోస్ట్ లో వివరిస్తూ.."నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్.. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుంటే.. నాకేం వినబడలేదు. గత కొన్నిరోజుల నుంచి నేను ఎందుకు కనిపించట్లేదు అని అడిగిన వాళ్ల కోసం ఇప్పుడు చెబుతున్నా. నేను ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (Sensorineural Hearing Loss) సమస్యతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారు. వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగింది. దీన్ని నేను అస్సలు ఊహించలేదు.

Also Read : కన్నడ ఇండస్ట్రీలో మరో రచ్చ.. పెళ్ళైన హీరోతో ‘కాంతారా’ హీరోయిన్ అక్రమ సంబంధం?

ఒక్కటే చెబుతున్నా.పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి. త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను" అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక అల్కా యాగ్నిక్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో 90 ల కాలంలో ఎన్ని హిట్ సాంగ్స్ పాడి స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో పలు సింగింగ్ అండ్ రియాలిటీ షోస్ కి జడ్జిగా కూడా వ్యవహరించింది.

Advertisment
తాజా కథనాలు