Karan Johar : బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సినీ విశేషాలతో పాటూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. క్రమంలోనే తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్ పై నెటిజన్ రియాక్ట్ అయిన తీరును తప్పు బట్టారు. ఈ క్రమంలోనే సదరు నెటిజన్ ను తనదైన శైలిలో బదులిచ్చారు.
ఏం జరిగిందంటే..
సరోగసి ద్వారా 2017లో ఇద్దరు పిల్లలకు (యశ్, రూహీ) తండ్రి అయిన కరణ్ జోహార్.. ఆ చిన్నారులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల రూహీ ఫొటోను ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘రూహీ వర్సెస్ సిరి’ అని క్యాప్షన్ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘రూహీ తల్లి ఎవరు? దయచేసి ఎవరైనా చెప్పండి. ఈ విషయంలో నేను గందరగోళానికి గురి అవుతున్నా’’ అని కామెంట్ చేశాడు. దీనిపై తాజాగా కరణ్ స్పందించారు.
Also Read : సినీ ఇండస్ట్రీ లో విషాదం.. ‘ఆదిపురుష్’ నటి మృతి
కరణ్ రియాక్షన్..
'ఆమెకు తండ్రి మాత్రమే కాదు తల్లిని కూడా నేనే. మీ అయోమయ స్థితి గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా. అందుకే మీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది' అని ఆ నెటిజన్ కు బదులిచ్చారు. కాగా కరణ్ సరోగసి విధానంలో తండ్రి అయ్యారు. తన తండ్రి (యశ్ జోహార్) మీద ఉన్న ప్రేమతో బాబుకు యశ్.. తల్లి (హిరూ) మీద ఉన్న అభిమానంతో పాపకు రూహీ అని పేరు పెట్టాడు.