Sanjay Gadhvi: గుండె పోటుతో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత..!

సినీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గాద్వి ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు.

New Update
Sanjay Gadhvi:  గుండె పోటుతో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత..!

Sanjay Gadhvi: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గాద్వి గుండెపోటుతో మరణించారు. దీంతో సినీ చిత్ర పరిశ్రమలో మరో సారి విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు చంద్రమోహన్ మరణించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే మరో ప్రముఖ దర్శకుడు మరణించడంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ముంబైలోని వారి నివాసంలో ఆదివారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారని.. ఆయన కుమార్తె సంజినా తెలిపారు. సంజయ్ గాద్వి మరణంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు డైరెక్టర్ సంజయ్ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

publive-image

Also Read: Tamil Hero VijayKanth: తమిళ నటుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

దర్శకుడు సంజయ్ గాద్వి 2000 లో "తేరే లియా" సినిమాతో డైరెక్టర్ గా తన కెరియర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత 2004 లో ధూమ్, ధూమ్ 2 సినిమాలతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. "కిడ్నాప్", "ఆపరేషన్ పరిందే", "అజబ్ గజాబ్ లవ్", "మేరే యార్ కి షాదీ హై" సినిమాలకు దర్శకత్వం వహించారు.

publive-image

Also Read: Miss Universe 2023: విశ్వసుందరి పోటీల్లో బ్యూటీల అందాలు విందు.. పిచ్చెక్కించే ఫొటొలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు