/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rrrr-jpg.webp)
Ravi Teja: మాస్ మహారాజ రవితేజకు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ క్షమాపణ చెప్పారు. 1988లో రవితేజ తనతో ఫోటో దిగడానికి స్టూడియోకు వచ్చాడని, కానీ తాను షూటింగ్ బిజీ కారణంగా కుదరదని చెప్పానని, ఆ రోజు అలా అన్నందుకు ఇప్పుడు క్షమాపణ చెబుతున్నానని అనుపమ్ ఖేర్ అన్నారు. దీంతో పక్కనే ఉన్న రవితేజ, అది ఇప్పుడు ఎందుకు అన్నట్లుగా 'సర్ ప్లీజ్..' అన్నారు. అనుపమ్ ఖేర్ ఈ విషయం చెప్పిన తర్వాత అభిమానుల నుంచి రవితేజకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
1988 :- #AnupamKher rejected to click a photo with #RaviTeja 😢💔
2023 :- #AnupamKher is doing a key role in Mass Maharaja @RaviTeja_offl most anticipated Project #TigerNageswaraRao 🥵🔥
True definition of Success 💥💯 pic.twitter.com/z3GY4rPEc7
— Neeraj Kumar (@73forever_) October 4, 2023
వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తోన్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో అనుపమ్ ఖేర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ ఘటనను అనుపమ్ ఖేర్ గుర్తు చేసుకున్నాడు. 1988లో ఓ సారి రవితేజ తన స్టూడియోకి వచ్చాడట. అప్పుడు చిన్న పిల్లాడిలా ఉండేవాట.. ఫోటోనో, అటో గ్రాఫో అడిగాడట. కానీ తాను ఇవ్వలేదట.. కుదరదని చెప్పాడట. కానీ ఇన్నేళ్ల తరువాత ఇలా ఆయన సినిమాలోనే నేను ఓ పాత్రను పోషిస్తున్నాను.. ఆ రోజు అలా అన్నందుకు సారీ అంటూ రవితేజను క్షమించమని కోరాడు అనుపమ్ ఖేర్. దీంతో రవితేజనే తిరిగి.. సార్ అంటూ దండం పెట్టేశాడు.
ఈ విజువల్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. సక్సెస్‌కు నిదర్శనం ఇదే అంటూ మాస్ మహారాజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. ప్రతీ ఫ్రేమ్, షాట్, డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయింది. ఇక అన్ని భాషల్లో రవితేజ తన గొంతునే వినిపించాడు. హిందీలో డబ్బింగ్ చెప్పాడు. చివరకు మలయాళంలో సైతం రవితేజ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. రవితేజ తన డెడికేషన్ ఏ లెవెల్లో ఉందో ఈ ట్రైలర్‌తోనే చూపించాడు. అక్టోబర్ 20 ఈ చిత్రం దసరా బరిలోకి దిగుతోంది.
మాస్ మహారాజ రవితేజకు నార్త్‌లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంటుంది. డబ్బింగ్ సినిమాలతో రవితేజ అక్కడ బాగానే పాపులర్. ఆయన డబ్బింగ్ సినిమాలకు బుల్లితెరపై, యూట్యూబ్‌లో అక్కడ బాగా డిమాండ్ ఉంటుంది. ఇన్నాళ్లకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ పాన్ ఇండియాకు వెళ్తున్నాడు. ఈ ట్రైలర్‌ను మొన్నే రిలీజ్ చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో రవితేజ హిందీలో ఇరగ్గొట్టేశాడు.