boAT Smart Watch: మీరు బోట్ స్మార్ట్ వాచ్ వాడుతున్నారా? అయితే మీ డేటా మొత్తం గోవిందా..! ఇటీవల ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ Bot పై సైబర్ దాడి జరిగింది. ఈ సైబర్ దాడిలో, కంపెనీకి చెందిన 75 లక్షల మందికి పైగా కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. లీక్ అయిన డేటాలో వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు, కస్టమర్ ఐడీలు, అడ్రెస్ లు ఉన్నాయి. By Bhoomi 08 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి boAT Smart Watch: హెడ్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ boAt యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. ఇటీవల ఈ కంపెనీపై సైబర్ దాడి జరిగినట్లు ఫోర్బ్స్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. ఈ సైబర్ దాడిలో బోట్ కంపెనీకి చెందిన 75 లక్షల మంది కస్టమర్ల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో ఉంచారు హ్యాకర్లు. లీక్ అయిన సమాచారంలో వ్యక్తుల పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ ID, కస్టమర్ IDలు ఉన్నాయి. దీనికి సంబంధించి బోటు కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ShopifyGUY అనే హ్యాకర్ తాను boAt డేటాబేస్‌ను ఏప్రిల్ 5న యాక్సెస్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ హ్యాకర్ దొంగిలించిన సమాచారాన్ని డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉంచాడు. ఈ డేటా వల్ల వ్యక్తిగత డేటా బయటకు రావడమే కాకుండా ఆర్థిక మోసాలు, సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా లావేదేవీలు నిర్వహించడంతోపాటు క్రెడిట్ కార్డులను మోసపూరిత లావాదేవీలకు వినియోగించే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ తరహా డేటా లీకేజీతో కంపెనీలు వినియోగదారల నమ్మకాన్ని కోల్పోవడంతోపాటు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కొవల్సి వస్తుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. డేటా లీకేజీ ఘటనపై బోట్ అధికారంకగా ఇంకా స్పందించలేదు. అమన్ గుప్తా సమీర్ మెహతా కలిసి 2016లో బోట్ సంస్థను ప్రారంభించారు. 2023 మూడో త్రైమాసికంలో రెండో పాపులర్ వేరియబుల్ బ్రాండ్ గా బోట్ అవతరించినట్లు ఐడీసీ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇటీవల కంపెనీ కూడా నష్టాలను చవిచూసింది. భవిష్యత్తులో సైబర్ దాడులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, అందువల్ల boAt వంటి కంపెనీలు తమ కస్టమర్ల సమాచార భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: మస్తు పనిచేసిండ్రు..ఇక ఇంటికి పోండి..ఐటీ కంపెనీ నిర్ణయం..! #boats #data-leak #dark-web మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి