Maheshwar Reddy: దీక్ష విరమించిన మహేశ్వర్ రెడ్డి.. అసలేంటి? నిర్మల్ మాస్టర్ ప్లాన్ రగడ నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ కొన్నిరోజులుగా మహేశ్వర్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. By BalaMurali Krishna 21 Aug 2023 in రాజకీయాలు ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Maheshwar Reddy : తెల్లవారుజామున దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ కొన్నిరోజులుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే అంబులెన్స్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో మహేశ్వర్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి దీక్ష విరమింపచేశారు. రెండు రోజుల క్రితం పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సోమవారం నిర్మల్ పర్యటన ఖారారైంది. అయితే ఈలోపే ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం.. మహేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు ఆదివారం నిర్మల్ వెళుతున్న మాజీ మంత్రి, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Aravind)ను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వీరి అరెస్టుపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న డీకే అరుణను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ నియంత పోకడలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ రగడ ఎందుకు? నిర్మల్ పట్టణంలో కొత్త మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం జీవో నెంబర్ 220 విడుదల చేసింది. పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటుచేయాలనేది ఈ జీవో ఉద్దేశం. అయితే ఈ మాస్టర్ ప్లాన్‌లో భారీ అవినీతి జరిగందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అభివృద్ధి ముసుగులో పచ్చని పంట పొలాలను నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. గ్రీన్ జోన్‌ను ఇండస్ట్రీయల్ జోన్‌గా మారుస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు ముందే రైతుల దగ్గర తక్కువకు భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థగా మారిపోయిందని ఫైర్ అవుతున్నారు. Also Read: సిద్ధిపేటలోనే నిన్ను ఓడిస్తా.. హరీష్‌రావుకు మైనంపల్లి వార్నింగ్ #maheshwar-reddy #telangana-go-220 #nirmal-master-plan #maheshwar-reddy-sits-on-hunger-strike #bjp-leader-maheshwar-reddy-sits-on-hunger-strike మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి