BJP: అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్న కలెక్టర్ ను ఈసీ తొలగించాలి.. భరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణను ఈసీ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్. నెల్లూరు జిల్లాలో అనేకమంది ప్రభుత్వాధికారులు వైసీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
BJP: అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్న కలెక్టర్ ను ఈసీ తొలగించాలి.. భరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

Bharath Kumar: అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలన్నారు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అనేకమంది ప్రభుత్వాధికారులు వైసీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న అధికారులపై ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం..!

మంత్రి కాకాని దగ్గర ఓఎస్డిగా పనిచేస్తున్న సరళ నేటికి వైసీపీ కార్యకర్తగానే పనిచేస్తుందని ఆమె పై చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం లో ఐదు మంది ఇన్చార్జిలుగా ఎమ్మార్వో లు పనిచేస్తున్నారని వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పిడి సాంబశివరెడ్డి , ZP డిప్యూటీ సీఈవో చిరంజీవి, డిపిఓ సుస్మిత రెడ్డిలు వైసిపి ఏజెంట్ గా పనిచేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారిపై జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ హరి నారాయణ హిందూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Also Read: చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నాడు.. కొడాలి నాని విమర్శనాస్త్రాలు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఆ ఎమ్మెల్యేల పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఎన్నికల విధుల నుంచి తొలగించిన విధంగా జిల్లా కలెక్టర్ కూడా తొలగించాలన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు