తండ్రి చనిపోయిన తరువాతే నిద్ర విలువ తెలిసింది: బిల్‌ గేట్స్‌!

మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర అనే దానికి చోటు లేకుండా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కొందరూ బిజిబిజీగా గడుపుతుంటారు

New Update
తండ్రి చనిపోయిన తరువాతే నిద్ర విలువ తెలిసింది: బిల్‌ గేట్స్‌!

మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర అనే దానికి చోటు లేకుండా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కొందరూ బిజిబిజీగా గడుపుతుంటారు.

చాలా మంది జీవితంలో నిద్ర అనేది చాలా తేలికైన విషయంగా భావిస్తారు. ఓ మూడు నాలుగు గంటలు నిద్ర పోతే చాలు అనుకుంటు ఉంటారు. కానీ అలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర కచ్చితంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

తాజాగా నిద్ర గురించి మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. బిల్‌ గేట్స్‌ ను నెలకొల్పినప్పుడు నిద్రపోవడం సోమరితనంగా, నిద్ర అనవసరమైనదిగా భావించేవారంట. కానీ నిద్ర సోమరితనం కాదని, నిద్ర అనేది చాలా అవసరమని తన తండ్రి మరణించిన తరువాతే బిల్‌ గేట్స్‌ కు తెలిసిందంట.

ఈ విషయాలను ఓ కార్యక్రమంలో గేట్స్‌ నే స్వయంగా తెలిపారు. నేను మధ్య వయసులో ఉన్నప్పుడు నిద్ర పోవటానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాదు. నిద్ర అనేది సోమరితనం, అవసరం లేనిది అనే భావనలో ఉండేవాడిని. కొంత మంది నేను ఆరు గంటలు నిద్రపోయానని ఒకరు అంటే..మరొకరు నేను ఐదు గంటలే నిద్రపోయానని చెప్పేవారు...కొన్నిసార్లు అసలు నిద్రపోనని మరొకరు అనేవారు...ఆ మాటలు వింటే వారు ఎంత గొప్పగా పని చేస్తున్నారనిపించింది.

నేను కూడా నిద్రపోకుండా ఉండటానికే ఎక్కువ ప్రయత్నించేవాడిని అంటూ బిల్‌ గేట్స్ చెప్పుకొచ్చారు. అయితే, 2020లో తన తండ్రి మరణంతో నిద్రపై తన అభిప్రాయం మారిందని చెప్పారు. తన తండ్రి అల్జీమర్స్ తో చనిపోవడమే అందుకు కారణమని అన్నారు. అప్పటి నుంచి నిద్రకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు.

రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోతున్నానా? ఎంత సుఖంగా నిద్రపోతున్నా? అని లెక్కలు వేసుకుంటున్నట్లు బిల్ గేట్స్ వివరించారు. బయట కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదు. మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని బిల్ గేట్స్ ఈ సందర్భంగా సూచించారు. యుక్తవయస్సు నుంచి కూడా తగినంత మంచి నిద్రపోవడం చాలా ముఖ్యమని బిల్ గేట్స్ చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు