Bigg Boss Winner: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్..

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో భాగంగా ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు.

New Update
Bigg Boss Winner: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్..

Pallavi Prashant Gets Bail:బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ కేసులో భాగంగా ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు.

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన తరువాత అన్నపూర్ణ స్టూడియో వద్ద అతని అభిమానులు నానా హంగామా సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై దాడి చేసి, బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతరులకు సంబంధించిన కార్లపైనా దాడులు చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. దీంతో పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ పల్లవి ప్రశాంత్ తరఫున న్యాయవాదులు పిటిషన్ వేయగా.. శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది.

కాగా, ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో అటు పోలీసులు.. ఇటు ప్రశాంత్ తరఫు న్యాయవాదల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా.. బయట జరిగిన గొడవతో పల్లవి ప్రశాంత్‌కు సంబంధం లేదన్న అతని తరపు న్యాయవాదులు వాదించారు. అయితే, ప్రశాంత్ రెచ్చగొట్టడం వల్లే అతని అభిమానులు రెచ్చిపోయారని పోలీసుల వాదించారు. అల్లర్లు జరగడానికి పల్లవి ప్రశాంతే కారణమని డీసీపీ విజయ్ స్పష్టం చేశారు. ఆయన రెచ్చగొట్టడం వల్లే ఫ్యాన్స్ రెచ్చిపోయారని, బిగ్‌బాస్‌ నిర్వాహకులను సైతం వదలబోమని స్పష్టం చేశారు డీసీపీ విజయ్.


Also Read:

పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 90 శాతం వరకు.. వివరాలివే!

ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు!

Advertisment
తాజా కథనాలు