Bigg Boss Manas Marriage: ఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లి వేడుకలు.. సన్నీ, కాజల్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

ఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి పెళ్లి వేడుకలు. నవంబర్ 22 న జరిగిన మానస్ పెళ్లి వేడుకలకు పలువురు బుల్లి తెర సెలెబ్రెటీలు హాజరయ్యారు. బిగ్ బాస్ విన్నర్ సన్నీ, కాజల్, సిరి, హమీద, శ్రీహన్ సందడి చేశారు.

New Update
Bigg Boss Manas Marriage: ఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లి వేడుకలు.. సన్నీ, కాజల్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

Bigg Boss Manas Marriage: బుల్లి తెర యాక్టర్ మానస్ నాగులపల్లి ఇటీవలే చెన్నై కి చెందిన అమ్మాయిని నిశితార్థం చేసుకున్నారు. నవంబర్ 22 న మానస్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. మానస్, శ్రీజ హల్దీ, సంగీత్, మెహందీ ఈవెంట్స్ లో పలువురు బుల్లితెర సెలెబ్రెటీస్, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ తేజ, శుభ శ్రీ పాల్గొని సందడి చేశారు. మానస్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రీజ.. ఈమె ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ప్రస్తుతం వీళ్ళ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ పెళ్లి ఫొటోలు చూసిన మానస్ ఫ్యాన్స్ తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

ఈ పెళ్లి వేడుకల్లో మానస్ బెస్ట్ ఫ్రెండ్స్ కాజల్, సన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ హమీద, సిరి, ప్రియా, ఈ పెళ్లి వేడుకల్లో   సందడి చేశారు. అంతే కాదు మానస్ నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్ టీమ్ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లి వేడుకలకు ప్రముఖ సెలెబ్రెటీస్, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు.

publive-image

బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్ గా పాపులర్ అయిన మానస్ ప్రస్తుతం టాప్ రేటింగ్స్ తో ముందుకెళ్తున్న బ్రహ్మముడి సీరియల్ చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు