Bigg Boss 7 Telugu Promo: గులాబీపురం VS జిలేబీపురం.. రెండు ఊళ్ళ మధ్య పోటీ..!

ఇక ఈరోజు ప్రోమోలో అందరు రకరకాల గెటప్స్ లో చాలా ఫన్ చేస్తూ కనిపించారు. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. విడిపోయిన భార్య, భర్తల పాత్రలో ఉన్న తేజ, శోభ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ చాలా ఫన్ క్రియేట్ చేశారు. హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళ పాత్రల్లో కామెడీ చేస్తూ కనిపించారు.

New Update
Bigg Boss 7 Telugu Promo: గులాబీపురం VS జిలేబీపురం.. రెండు ఊళ్ళ మధ్య పోటీ..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో నిన్నటి వరకు నామినేషన్ ఎపిసోడ్ (Nominations) రచ్చ జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అంతా చాలా ఫైర్ మీద కనిపించారు. ఇక ఈరోజు ప్రోమోలో అందరు రకరకాల గెటప్స్ లో చాలా ఫన్ చేస్తూ కనిపించారు. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు హౌస్ మేట్స్ ఆడుతున్న టాస్క్.. గులాబీపురం, జిలేబీపురం ఈ రెండు ఊళ్ళల్లో ఉండే గ్రహాంతర వాసులను ఏ టీం సభ్యులు ఎక్కువ గ్రహాంతర వాసులను సంతోషపెడతారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ గా పోటీ చేస్తారని బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక్కొక్క పాత్రను ఇచ్చాడు. అందులో తేజ, శోభ (Shobha) విడిపోయిన భార్య భర్తలు, అమర్  ఊళ్ళో వాళ్ళకి గాసిప్స్ చెప్పే టీ కొట్టువాడు, శివాజీ ఊరి పెద్ద ఇలా అందరికి ఒక్కొక్క పాత్రను ఇచ్చాడు.

Also Read: Bigg Boss 7 Telugu: నీకు ఎర్రగడ్డనే దిక్కు .. నువ్వు బిగ్ బాస్ మోనితవే..!

తేజ, శోభ ఫన్
విడిపోయిన భార్య, భర్తల పాత్రలో ఉన్న తేజ, శోభ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ చాలా ఫన్ క్రియేట్ చేశారు. మధ్యలో అమర్ (Amar) వచ్చి తేజ పై గాసిప్స్ చెప్పడం దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం ఇలా టాస్క్ అంతా చాలా ఫన్నీగా ఉన్నట్లు కనిపించింది.

అమెరికా అబ్బాయి గా యావర్
అమెరికా నుంచి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి పాత్ర యావర్ (Yawar Prince) చేస్తున్నాడు. తను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అంటూ వచ్చీ.. రాని తెలుగులో మాట్లాడుతూ ఫన్నీగా కనిపించాడు. అలాగే అశ్విని, అమర్, శివాజీ, ప్రశాంత్, అర్జున్ అందరు వాళ్ళ పాత్రల్లో  కామెడీ చేస్తూ టాస్క్ చాలా  ఆహ్లాదకరంగా  సాగింది.

Bigg Boss 7 Telugu Promo

కెప్టెన్సీ టాస్క్

కెప్టెన్సీ టాస్క్ లో మొదటి లెవెల్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు రెండు టీమ్స్ గా విడిపోయారు. ఈ టాస్క్ లో ఎవరైతే ఎక్కువ గుడ్లను సురక్షితమైన గూడుకు తరలిస్తారో వాళ్ళు విన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. కానీ ఈ టాస్క్ లో బిగ్ బాస్ పెద్ద చిక్కు పెట్టాడు. ఆ గుడ్డును సురక్షితమైన గూడుకు చేర్చాలంటే పెడస్టల్ పై గుడ్డును  పెట్టుకొని అది కింద పడకుండా బిగ్ బాస్ వేసిన దారిని దాటుకుంటూ వెళ్ళాలి. ఇక ఈ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు అన్నది ఎపిసోడ్ లో తెలుస్తుంది.

ప్రోమో ప్రకారం ఈరోజు ఎపిసోడ్ కాస్త ఫన్నీగా, కాస్త సీరియస్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గులాబీపురం, జిలేబీపురం టాస్క్ ప్రేక్షకులకు చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండబోతున్నట్లు కనిపించింది.

Also Read: ఎయిర్ పోర్ట్ లో కూతురు ‘క్లింకార’ తో రామ్ చరణ్.. ఫొటోలు ఇవే!

Advertisment
తాజా కథనాలు