Bigg Boss 7 Telugu Promo: రాజ మాతల సమక్షంలో నామినేషన్స్.. వాళ్ళ మాటే శాశనం..!

బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమో విడుదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ.. బిగ్ బాస్ మహా రాజ్యంలో జరుగుతుందని.. రాజమాతలైన శోభ, రతిక, అశ్విని, ప్రియాంక చెప్పిందే తుది నిర్ణయమని తెలిపారు బిగ్ బాస్. గౌతమ్- శివాజీ మధ్య వాదనలు జరిగినట్లుగా ప్రోమోలో కనిపించింది.

Bigg Boss 7 Telugu Promo: రాజ మాతల సమక్షంలో నామినేషన్స్.. వాళ్ళ మాటే శాశనం..!
New Update

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. ఈరోజు నామినేషన్స్  ప్రోమో విడుదలైంది. మండే వచ్చిందంటే.. ఇక ఇంటి సభ్యుల మధ్య  నామినేషన్స్ రచ్చ మొదలవుతుంది. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ కొంచం వైరైటీగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఈ సారి నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ మహా రాజ్యంలో జరుగుతుంది.. ఈ రాజ్యానికి శోభ, అశ్విని, ప్రియాంక, రతిక రాజ మాతలు.. వారు చెప్పిందే తుది నిర్ణయమని తెలిపారు బిగ్ బాస్.

publive-image

రాజ మాతల సమక్షంలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ముందుగా అమర్ (Amar) , అర్జున్ (Arjun) నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అమర్ భోలేను నామినేట్ చేశాడు. 'లాస్ట్ వీక్ టాస్క్ లో.. మీరు వీక్ కంటెస్టెంట్ అని మిమల్ని గేమ్ లో నుంచి తొలగించినప్పుడు.. డిఫెండ్ చేయకుండా సింపుల్ గా వెళ్లిపోవడం నాకు నచ్చలేదని నామినేట్ చేశాడు అమర్. దానికి భోలే ఆ టాస్క్ లో చాలా రాజకీయాలు జరిగాయి .. ఎంత వరకు డిఫెండ్ చేయాలో నాకు క్లారీటీ ఉంది. అది చెప్పడానికి నీకు హక్కు లేదని అమర్ తో వాదించాడు.

publive-image

ఆ తర్వాత గౌతమ్.. 'కెప్టెన్సీ టాస్క్ లో యావర్, అర్జున్ మాత్రం గేమ్ లో ఉండాలి.. గౌతమ్ వెళ్ళిపోవాలని చెప్పడం నాకు నచ్చలేదని శివాజీని (Shivaji) నామినేట్ చేశాడు. దానికి శివాజీ.. నువ్వు అప్పటికే కెప్టెన్ గా ఉన్నావు కదా.. అందుకే వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి, అలా చేశామని వాదించాడు. ఒకవేళ నేను అలా అనుకుంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో నీకు సపోర్ట్ చేసేవాన్నే కాదని గౌతమ్ కు కౌంటర్ ఇచ్చాడు శివాజీ.

Bigg Boss 7 Telugu

ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రశాంత్, గౌతమ్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రశాంత్ గౌతమ్ ను నామినేట్ చేస్తూ.. ఒక కెప్టెన్ గా ఉన్న నువ్వు .. వేరే వాళ్ళు చెప్పిన మాటలువినీ.. నిజం తెలుసుకోకుండా ఆరోపణలు చేశావని చెప్పాడు. దానికి గౌతమ్.. ప్రతీ సారి నువ్వు రివెంజ్ నామినేషన్ వేస్తావు అంతే.. అంటూ ప్రశాంత్ (Pallavi Prashanth) పై కోపంగా అరిచాడు. ఆ తర్వాత యావర్, అమర్ మధ్య కూడా ఆర్గుమెంట్ జరిగినట్లుగా ప్రోమోలో కనిపించింది. ఇక ప్రోమో చివరిలో ఇంటి సభ్యుల వాదనలు విన్న రాజమాతలు గౌతమ్, భోలే (Bhole) ఫొటోను కత్తితో చింపేశారు. అంటే గౌతమ్, భోలే ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss 7 Telugu Promo: ‘కుక్క తోక వంకర’ అమర్ కు భోలే కౌంటర్..!

#bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe