Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచిన అర్జున్.. మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ర్యాంకింగ్స్ ప్రకారం బాటమ్ 5 సభ్యులైన అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ అందరికంటే కరెక్ట్ గా బిగ్ బాస్ ఇచ్చిన పజిల్ సెట్ చేసి.. అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు.

New Update
Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచిన అర్జున్.. మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ ఇచ్చిన ర్యాంకింగ్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను 1 నుంచి 10లో మీరు ఏ ర్యాంకింగ్ లో ఉండడానికి అర్హులని భావిస్తున్నారో.. ఇంటి సభ్యులంతా డిస్కస్ చేసి నిర్ణయించాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యుల నిర్ణయం ప్రకారం శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభ మొదటి 5 ర్యాంకింగ్స్ లో నిల్చోగా.. అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక బాటమ్ 5 ర్యాంకింగ్స్ లో నిల్చున్నారు. ఈ టాస్క్ లో శోభ - అర్జున్, రతిక- ప్రశాంత్ ఇద్దరి మధ్య వాదన జరిగింది.

publive-image

నీకు లక్ ఫేవర్ చేసింది అంతే

ర్యాంకింగ్ కోసం జరిగిన వాదనలో అర్జున్ (Arjun), శోభ (Shobha) ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 'శోభ నువ్వు సొంతగా ఏ గేమ్ ఆడలేదు.. నీకు ఏదో ఒక రకంగా లక్ ఫేవర్ చేసింది.. అందుకే నువ్వు 7th ర్యాంక్ డిజర్వని.. నా అభిప్రాయం' అని చెప్పాడు అర్జున్. ఆ తర్వాత శోభ ఛాన్స్ వచ్చినప్పుడు శోభ కూడా.. సేమ్ అదే డైలాగ్ చెప్పి అర్జున్ కు కౌంటర్ ఇచ్చింది. 'ఏదైనా టాస్క్ ఆడేటప్పుడు.. నీ హైట్ వల్ల.. నీకు కూడా లక్ ఫేవర్ చేసింది అంటు అర్జున్ కు 8th ర్యాంక్ ఇచ్చింది.

publive-image

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్

ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ర్యాంకింగ్స్ ప్రకారం బాటమ్ సభ్యులు వీక్ అని భావించినందున... వీక్ కంటెస్టెంట్స్ కి మాత్రమే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవసరం.. అందుకే బాటమ్ 5 ర్యాంకింగ్స్ లో నిల్చున్న అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక ఈ టాస్క్ ఆడతారని తెలిపారు బిగ్ బాస్.

Bigg Boss 7 Telugu

ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచిన అర్జున్

'ఎవిక్షన్ ఫ్రీ పాస్' (Eviction Free Pass) గెలవడానికి బిగ్ బాస్ బాటమ్ 5 సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో పాల్గొనే సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన "ఎవిక్షన్ ఫ్రీ పాస్" అనే పేరుతో ఉన్న 'పజిల్' సెట్ చేయాలనీ చెప్పారు. ఈ టాస్క్ ముందుగా పూర్తి చేసి.. బెల్ కొట్టింది అశ్విని. ఆ తర్వాత రతిక, గౌతమ్, అమర్ (Amar), చివరిగా అర్జున్ పూర్తి చేశారు. ఈ టాస్క్ లో సంచాలకుడిగా వ్యవహరించిన శివాజీ.. అన్ని పజిల్స్ గమనించి అందరికంటే కరెక్ట్ గా సెట్ చేసిన అర్జున్ ఈ టాస్క్ విన్నర్ అని తెలిపారు. ఎవిక్షన్ పాస్ గెలిచాక.. దాన్ని డిఫెండ్ చేసుకోవాలని అర్జున్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss 7 Telugu Promo: అంతా ఉల్టా పుల్టా.. బాటమ్ 5 సభ్యులకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్..!

Advertisment
తాజా కథనాలు