TDP: టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి అమర్నాథ్‌రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌రెడ్డి..!

చిత్తూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. అమర్నాథ్‌రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌రెడ్డి వైసీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డిపై..టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు శ్రీనాథ్‌రెడ్డి భార్య అనీషారెడ్డి. అప్పటి నుంచి శ్రీనాథ్‌రెడ్డి ఫ్యామిలీ పార్టీకి దూరంగా ఉన్నారు.

New Update
TDP: టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి అమర్నాథ్‌రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌రెడ్డి..!

Chittoor TDP: చిత్తూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. అమర్నాథ్‌రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌రెడ్డి వైసీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి మదనపల్లిలో శ్రీనాథ్‌రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 25న సీఎం జగన్ సమక్షంలో చేరే ఛాన్స్ కనిపిస్తోంది.

Also Read: టెన్త్ ఫలితాల్లో టాప్ ర్యాంక్.. రికార్డు సృష్టించిన మనస్వి..!

గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డిపై..టీడీపీ తరపున పోటీ చేసింది శ్రీనాథ్‌రెడ్డి భార్య అనీషారెడ్డి. ఓటమి తర్వాత అనీషారెడ్డిని.. పుంగనూరు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా తప్పించింది టీడీపీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీనాథ్‌రెడ్డి ఫ్యామిలీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అసంతృప్త నేతలను చాకచక్యంగా ఆకట్టుకుంటూ తమ వైపు తిప్పుకుంటోంది వైసీపీ.

Advertisment
తాజా కథనాలు