DK Aruna: బీజేపీ నేత డీకే అరుణకు సుప్రీంకోర్టులో షాక్‌

బీజేపీ నేత డీకే అరుణకు సుప్రీంకోర్టులో గట్టి షాక్‌ తగిలింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట కలిగిస్తూ తీర్పు ఇచ్చింది.

DK Aruna: బీజేపీ నేత డీకే అరుణకు సుప్రీంకోర్టులో షాక్‌
New Update

DK Aruna: బీజేపీ నేత డీకే అరుణకు సుప్రీంకోర్టులో గట్టి షాక్‌ తగిలింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట కలిగిస్తూ తీర్పు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.

సుప్రీం తీర్పుతో సందిగ్ధంలో అరుణ..

గ‌ద్వాల్‌ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నేత కృష్ణమోహ‌న్‌రెడ్డి త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేశారని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి నేత డీకే అరుణ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కృష్ణమోహన్ ఎన్నిక చెల్లదని.. రెండో స్థానంలో నిలిచిన అరుణ‌ను ఎమ్మెల్యేగా ప్రక‌టించాల‌ని తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కృష్ణమోహన్ సుప్రీంకోర్టులో పిటిషన వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీకోర్టు స్టే విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పుతో డీకే అరుణ సందిగ్ధంలో పడినట్లైంది. ఇప్పటికే ఆమెను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని అరుణ రెడీ అయ్యారు. ఈ సమయంలో సుప్రీం తీర్పు రావడంతో ప్రమాణ స్వీకారానికి ఆటంకం ఏర్పడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన డీకే అరుణ 73వేల612 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లక్షా 57 ఓట్లు సాధించి గెలుపొందారు.

గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ లేఖ..

అంతకుముందు తెలంగాణ హైకోర్టు తీర్పుతో గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ ఆమె కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.

బీజేపీ నేత డీకే అరుణ గురించి..

గద్వాల నుంచి డీకే అరుణ 2004 నుంచి 2014వరకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2004లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె.. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. 2018లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణమోహన్‌ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత డీకే అరుణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణనే..ఎన్నికల సంఘం ప్రకటన!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe