AP: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్..ఏపీ హైకోర్టులో ఊరట.!

మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు గుడివాడ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నానిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొడాలికి 41-ఏ నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

New Update
AP: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్..ఏపీ హైకోర్టులో ఊరట.!

EX Minister Kodali Nani: ఏపీలో వాలంటీర్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా నిలుస్తూ పలువురు వాలంటీర్లు (Volunteers) రాజీనామా చేశారు. అయితే, ఎన్నికల అనంతరం తాము ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదని తమతో బలవంతంగా రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నానినిపై వాలంటీర్లు గుడివాడలో ఫిర్యాదు చేశారు.

Also Read: నోరు పారేసుకోకు.. నెక్ట్స్ జైలుకు వెళ్లేది నువ్వే: ఎమ్మెల్యే సోమిరెడ్డి

తాజాగా, మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో (AP High Court) ఊరట లభించింది. ఈ కేసులో నానిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొడాలికి 41-ఏ నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ పాటించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

Advertisment
తాజా కథనాలు