Election Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు

కొద్ది సేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Election Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు
New Update

తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (CEC) కొద్ది సేపటి క్రితం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను (TS Assembly Elections 2023 Notification) విడుదల చేసింది. దీంతో నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసుల్లో అభ్యర్థుల తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించింది ఈసీ. అభ్యర్థులు సువిధ పోర్టల్ ద్వరా ఆన్లైన్లోనూ నామినేషన్ల దాఖలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల కమిషన్. నామినేషన్‌ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు, ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. సీసీ కెమెరాల నిఘాలో రిటర్నింగ్ ఆఫీసులు ఉండనున్నాయి.
ఇది కూడా చదవండి: Telangana: సర్వం సిద్ధం.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి..
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 3
నామినేషన్లకు ఆఖరి తేదీ: నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 15
పోలింగ్: నవంబర్ 30
కౌంటింగ్: డిసెంబర్ 3

#telangana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe